te_tn_old/mrk/front/intro.md

16 KiB

మార్కు సువార్త యొక్క పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

మార్కు సువార్త యొక్క విభజన

  1. పరిచయము (1:1-13)
  2. గలిలయలో యేసు పరిచర్య
  • ప్రారంభ పరిచర్య (1:14-3:6)
  • యేసు ప్రజలలో మరింత ప్రాచుర్యం పొందాడు (3:7-5:43)
  • గలిలయ నుండి దూరంగా వెళ్ళటం మరియు తిరిగి రావటం (6:1 -8:26)
  1. యేరుషలేము ఎడల అభివృద్ధి, యేసు తన మరణమును గురించి పదేపదే ప్రవచించినప్పుడు; శిష్యులు అపార్థం చేసుకుంటారు, మరియు యేసు తనను అనుసరించడం ఎంత కష్టమో వారికి బోధిస్తాడు (8:27-10:52)
  2. పరిచర్య యొక్క చివరి రోజులు మరియు యేరుషలేములో చివరి విభేదముకు సిద్ధపాటు (11:1-13:37)
  3. క్రీస్తు యొక్క మరణం మరియు ఖాళి సమాధి (14:1-16:8)

మార్కు సువార్త దేనిని గురించి వివరించుచున్నది?

యేసు క్రీస్తు జీవితమును వివరించే క్రొత్త నిబంధనలోని నాలుగు పుస్తకములలో మార్కు సువార్త ఒకటి. సువార్త రచయితలు యేసు ఎవరు మరియు ఆయన ఏమి చేసారు అనే విభిన్న అంశాల గురించి వ్రాసారు. యేసు సిలువపై బాధను మరియు మరణమును గురించి మార్కు ఎక్కువగా వ్రాసాడు. హింసించబడుతున్న తన చదవరులను ప్రోత్సాహించుటకు అతను ఇలా చేసాడు. మార్కు యూదుల ఆచారాలను మరియు కొన్ని అరామిక్ మాటలను కూడా వివరించాడు. మార్కు తన మొదటి చదువరులలో ఎక్కువ మంది అన్యజనులని అనుకున్నాడని ఇది తెలియచేస్తుంది.

ఈ సువార్త యొక్క పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమా చేయువారు ఈ సువార్తను “మార్కు సువార్త” లేక “మార్కు ప్రకారంగా వ్రాయబడిన సువార్త” అని దాని సాంప్రదాయ పేరుతొ పిలవడానికి ఎంచుకోవచ్చు. లేక “మార్కు వ్రాసిన యేసు గురించిన సువార్త” అని స్పష్టంగా కనిపించే పేరును వారు ఎంచుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

మార్కు సువార్తను ఎవరు వ్రాసారు?

ఈ సువార్తలో రచయిత పేరు ఇవ్వబడలేదు. ఏదేమైనా, ప్రారంభ క్రైస్తవ కాలం నుండి, మార్కు ఈ సువార్త యొక్క రచయిత అని చాలా మంది క్రైస్తవులు భావించారు. మార్కును యోహాను మార్కు అని కూడా పిలిచేవారు. అతడు పేతురుకు సన్నిహితుడు. యేసు చెప్పినదానికి మరియు చేసినదానికి మార్కు సాక్ష్యమివ్వకపోవచ్చు. యేసు గురించి పేతురు చెప్పినదానిని మార్కు వ్రాసాడని చాలా మంది పండితులు భావించారు.

\nభాగము 2: భక్తిపరమైన మరియు సాంస్కృతిక ముఖ్య అంశాలు

యేసు యొక్క బోధన పద్ధతులు ఏమిటి?

ప్రజలు యేసును రబ్బీగా భావించారు. రబ్బీ అనగా దేవుని ధర్మశాస్త్ర బోధకుడైయున్నాడు. యేసు ఇశ్రాయేలీయులలోని ఇతర మత బోధకుల మాదిరిగానే బోధించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనను అనుసరించే విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులను శిష్యులని పిలచేవారు. ఆయన తరచుగా ఉపమానములను చెప్పాడు. ఉపమానాలంటే నీతిని నేర్పించే కథలైయున్నవి. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] మరియు [[rc:///tw/dict/bible/kt/disciple]] మరియు rc://*/tw/dict/bible/kt/parable)

భాగము 3: ముఖ్యమైన తర్జుమా ఇబ్బందులు

సంక్షిప్త సువార్తలు అంటే ఏమిటి? మత్తయి, మార్కు మరియు లూకా సువార్తలను సంక్షిప్త సువార్తలు అం పిలుస్తారు ఎందుకంటే అవి చాలా సారూప్య వాక్య భాగాలను కలిగి ఉన్నాయి. “సంక్షిప్తం అనే మాటకు “ కలిసి చూడటం” అని అర్థం.

రెండు లేక మూడు సువార్తలలోని మాటలు ఒకేలా లేక దాదాపుగా ఒకేలా ఉన్నప్పుడు “సమాంతరంగా” పరిగణించబడతాయి. సమానమైన భాగాలను తర్జుమా చేయునప్పుడు తర్జుమా చేయువారు ఒకే రకమైన మాటలను ఉపయోగించాలి మరియు వాటిని సాధ్యమైనంత సారూప్యత కలిగి ఉండేలా చేయాలి.

యేసు తనను తాను “మనుష్య కుమారుడు” అని ఎందుకు తెలియచేసాడు?

సువార్తలలో యేసు తనను తాను “మనుష్య కుమారుడు” అని పిలుచుకున్నాడు. ఇది దానియేలు 7:13-14 యొక్క సూచనయైయున్నది. ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి “మనుష్య కుమారుడు” గా వర్ణించబడ్డాడు. అంటే ఆ వ్యక్తి మనుష్యులవలె కనిపించే వ్యక్తియైయున్నాడు. దేశాలను శాశ్వతంగా పరిపాలించుటకు దేవుడు మనుష్య కుమారునికి అధికారము ఇచ్చాడు. మరియు ప్రజలందరూ ఆయనను శాశ్వతంగా ఆరాధిస్తారు.

యేసు కాలపు యూదులు ఎవరికీ “మనుష్య కుమారుడు” అనే పేరును ఉపయోగించలేదు. అందువలన తాను నిజంగా ఎవరో అని అర్థం చేసుకొనుటకు యేసు తనకు తానూ ఈ పేరును ఉపయోగించుకున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/sonofman)

”మనుష్య కుమారుడు” అనే పేరును అనేక భాషలలో అనువదిచడం కష్టతరము అవుతుంది. చదువరులు అక్షర అనువాదమును తప్పుగా అర్థం చేసుకోవచ్చు. తర్జుమా చేయువారు “మనుష్యుడైన ఒకడు” వంటి ప్రత్యామ్నాయాలను పరిగణించవచ్చు. పేరును వివరించుటకు ఒక ఫుట్ నోట్ ను చేర్చడం కూడా సహాయపడుతుంది.

తక్కువ వ్యవధిని సూచించే మాటలను మార్కు ఎందుకు తరచుగా ఉపయోగిస్తాడు?

మార్కు సువార్తలో “వెంటనే” అనే మాట నలభైరెండు సార్లు ఉపయోగించబడింది. సంఘటనలను మరింత ఉత్తేజకరమైన మరియు స్పష్టమైనదిగా చేయుటకు మార్కు దీనిని చేస్తాడు. ఇది చదువరిని ఒక సంఘటన నుండి మరొక సంఘటనకు త్వరగా తీసుకువెళ్ళుతుంది.

మార్కు పుస్తకం యొక్క వచనములోని ప్రధాన సమస్యలు ఏమిటి?

క్రింది వచనాలు పరిశుద్ధ గ్రంథము యొక్క పాత తర్జుమాలలో కనుగొనబడ్డాయి కాని ఆధునిక తర్జుమాలలో ఎక్కువగా చెర్చబడలేదు. ఈ వచనాలను అనువదించవద్దని తర్జుమా చేయువారికి సూచించారు. అయినప్పటికీ, తర్జుమా చేయువారి ప్రాంతంలో ఈ వచనాలను కలిగివున్న పరిశుద్ధ గ్రంథం యొక్క పాత తర్జుమాలు ఉంటే, తర్జుమా చేయువారు వాటిని చేర్చవచ్చు. \nఅవి అనువదించబడితే, అవి బహుశా మార్కు సువార్తకు నిజముగా సంబంధించినవి కాదని సూచించడానికి చదరపు బ్రాకెట్లలో [] ఉంచాలి.

  • “ఎవరికైనా వినుటకు చెవులు ఉంటె, అతనిని విననివ్వండి.” (7:16)
  • “నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు” (9:44)
  • “నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు” (9:46)
  • మరియు ‘ఆయన నేరము చేసినవారితో లెక్కించబడ్డాడు’ అని చెప్పే లేఖనము నెరవేరింది. (15:28)

ప్రారంభ వ్రాత పుస్తకములలో ఈ క్రింది భాగం కనుగొనబడలేదు. చాలా పరిశుద్ధ గ్రంథములు ఈ వాక్యభాగమును కలిగి ఉన్నాయి కాని ఆధునిక పరిశుద్ధ గ్రంథములు బ్రాకెట్లలో ([]) ఉంచాయి లేక ఈ వాక్య భాగము మార్కు సువార్తకు అసలైనదిగా ఉండకపోవచ్చని సూచిస్తుంది. తర్జుమా చేయువారు పరిశుద్ధ గ్రంథము యొక్క ఆధునిక తర్జుమాల మాదిరిగా ఏమైనా చేయమని సలహా ఇస్తారు.

  • “వారంలో మొదటి రోజు, ఆయన లేచిన తరువాత, ఆయన మొదట తాను ఏడు దయ్యములను వదలించిన మగ్దలేనే మరియకు మొదట కనిపించాడు. వారు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళి ఆయనతో ఉన్న వారితో చెప్పింది. ఆయన బ్రతికి ఉన్నాడని మరియు ఆమె ఆయనను చూసిందని వారు విన్నారు, కాని వారు నమ్మలేదు. ఈ విషయాల తరువాత ఆయన గ్రామమునకు నడచి వెళ్ళుతున్నప్పుడు వారిలో ఇద్దరికీ వేరే రూపం లో కనిపించాడు. వారు వెళ్లి మిగిలిన శిష్యులకు చెప్పారు, కానీ వారు నమ్మలేదు. యేసు పదకొండు మంది శిష్యులకు బల్ల యెద్ద భోజనం చేస్తూ ఉండగా వారికి కనిపించాడు, మరియు తానూ తిరిగి బ్రతికిన విషయం కొందరు చెప్పినా వారు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం మరియు హృదయ కాఠిణ్యం బట్టి వారిని గద్దించాడు. ఆయన వారితో, సర్వ లోకానికి వెళ్ళి సృష్టిలో అందరికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవారు రక్షణ పొందుతారు, నమ్మనివారు శిక్ష అనుభవిస్తారు. నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి: వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. క్రొత్త భాషలు మాట్లాడతారు. వారు తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు, విషం తాగినా వారికి ఏ హాని కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగు పడతారు. ప్రభువు వారితో మాట్లాడిన తరువాత, దేవుడు ఆయనను పరలోకమునకు స్వీకరించి, ఆయన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. శిష్యులు అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రభువును ప్రకటించారు, ప్రభువు వారికి తోడై వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా స్థిరపరచాడు.” (16:9-20)

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)