te_tn_old/mrk/11/intro.md

3.0 KiB

మర్కు సువార్త 11వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. పాత నిబంధనలోని వాక్యాలైన 11:9-10, 17 లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు

గాడిద మరియు గాడిద పిల్ల

యేసు ఒక జంతువుపై కూర్చొని యేరుషలేములోనికి వెళ్ళాడు. ఈ విధంగా ఆయన ఒక ముఖ్యమైన యుద్ధములో గెలిచిన తరువాత ఒక పట్టణంలోనికి వచ్చిన రాజులా ఉన్నాడు. ఆలాగే పాత నిబంధనలోని ఇశ్రాయేలు రాజులు గాడిదలపై ప్రయాణించారు. ఇతర రాజులు గుర్రములపై ప్రయాణించారు. కాబట్టి యేసు తానూ ఇష్రాయేలీయుల రాజని ఇతరుల లాగా లేడని చూపిస్తున్నాడు.

మత్తయి, మార్కు, లూకా మరియు యోహానులు అందరూ ఈ విషయమును గురించి వ్రాసారు. శిష్యులు యేసుకై గాడిదను తీసుకువచ్చారని మత్తయి మరియు మార్కులు తమ సువార్తలలో వ్రాసారు. యేసు గాడిదను కనుగొన్నాడని యోహాను తన సువార్తలో వ్రాసాడు. వారు ఆయనకు ఒక గాడిద పిల్లను తీసుకువచ్చారని లూకా వ్రాసాడు. యేసు గాడిదపై లేక గాడిద పిల్లపై ప్రయాణించాడో ఎవరికీ తెలియదు ఈ సంగాతులన్నితి యు.ఎల్.టి(ULT) లో కనిపించే విధంగా తర్జుమా చేయడం మంచిది. (చూడండి: మత్తయి 21:1- 7 మరియు (మార్కు 11:1-7 మరియు (లూకా 19:29-36 మరియు (యోహాను 12:14-15)