te_tn_old/mrk/03/intro.md

5.3 KiB

మార్కు సువార్త 03వ అధ్యాయములోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు

విశ్రాంతి దినం

విశ్రాంతి దినమున పని చేయడం మోషే ధర్మ శాస్త్రమునకు విరుద్దమైయున్నది. పరిసయ్యులు విశ్రాంతి దినమున రోగియైన వ్యక్తిని స్వస్థపరచడం “పని” అని నమ్ముతారు, కాబట్టి వారు విశ్రాంతి దినమున యేసు ఒక వ్యక్తిని స్వస్థపరచినప్పుడు ఆయన తప్పు చేసాడని వారు చెప్పారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

“పరిశుద్దాత్మకు వ్యతిరేకంగా దైవదూషణ”

ఈ పాపం చేసినప్పుడు ప్రజలు ఏ చర్యలు చేస్తారు లేక వారు ఏ మాటలు చెపుతారో ఎవరికిని ఖచ్చితంగా తెలియదు. అయితే బహుశా వారు పరిశుద్ధాత్మను, ఆయన పనిని అవమానిస్తున్నారు. వారు పాపులని ప్రజలకు అర్థం చేసి చెప్పడం మరియు దేవుని క్షమాపణ వారికి అవసరమని చెప్పడం పరిశుద్ధాత్మ యొక్క పనిలో ఒక భాగమైయున్నది. అందువలన పాపం చేయుట ఆపుటకు ప్రయత్నించని ఎవరైనా బహుశా దైవదూషణకు పాల్పడవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/blasphemy]] మరియు [[rc:///tw/dict/bible/kt/holyspirit]])

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

పండ్రెండు మంది శిష్యులు

పండ్రెండు మంది శిష్యుల పేరులు ఈ క్రిందున్నవి:

మత్తయి సువార్తలో:

సిమోను (పేతురు), అంద్రెయ, జేబేదయి కుమారుడైన యాకోబు, జేబేదయి కుమారుడగు యోహాను, ఫిలిప్పు, బర్తోలోమయి, తోమా, మత్తయి, అల్పయి కుమారుడైన యోకోబు, తద్దయి, కానానీయుడైన సిమోను మరియు ఇస్కరియోతు యూదా.

మార్కు సువార్తలో:

సిమోను (పేతురు), అంద్రెయ, జెబెదయి కుమారుడైన యాకోబు మరియు జెబెదయి కుమారుడగు యోహాను (వీరికి ఆయన బోయనేర్గెసు అని పేరు పెట్టాడు, ఆ మాటకు ‘ఉరిమేవారు’ అని అర్థం), ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్పయి కుమారుడైన యోకోబు, తద్దయి, కానానీయుడైన సిమోను మరియు ఇస్కరియోతు యూదా.

లూకా సువార్తలో:

సిమోను (పేతురు), అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్పయి కుమారుడైన యోకోబు, సిమోను (ఆయనను కనానియుడని లేదా జలోతే అని పిలుస్తారు), యోకోబు కుమారుడైన యూదా, మరియు ఇస్కరియోతు యూదా.

తద్దయి బహుశా యాకోబు కుమారుడైన యూదా అయియుండవచ్చు.

సహోదరులు మరియు సహోదరీలు

చాలా మంది ఒకే తలిదండ్రులను కలిగి ఉన్న వారిని “సోదరుడు” మరియు సోదరి” అని పిలుస్తారు మరియు వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారు. చాలా మంది ఒకే తాతయ్య అవ్వలతో ఉన్నవారిని “సోదరుడు” మరియు సోదరి” అని కూడా పిలుస్తారు. ఈ అధ్యాయములో యేసు దేవునికి విధేయులైనవారు తనకు అతి ముఖ్యమైన వ్యక్తులని చెప్పారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/brother)