te_tn_old/mat/27/intro.md

2.5 KiB

మత్తయి 27 సాధారణ గమనికలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

""అతన్ని పిలాతు గవర్నర్‌కు అప్పగించారు""

యూదా నాయకులు యేసును చంపడానికి ముందు రోమన్ గవర్నర్ పొంతి పిలాతు నుండి అనుమతి పొందవలసి ఉంది. రోమన్ చట్టం యేసును చంపడానికి వారిని అనుమతించక పోవడమే దీనికి కారణం. పిలాతు యేసును విడిపించాలని అనుకున్నాడు, కాని బరాబ్బా అనే చెడ్డ ఖైదీని విడిపించాలని వారు కోరుకున్నారు.

సమాధి

యేసు సమాధి చేయబడిన సమాధి ([మత్తయి 27:60] (../../mat/27/60.md)) ధనవంతులైన యూదా కుటుంబాలు తమలో చనిపోయిన వారిని సమాధి చేసే స్థలం. ఇది ఒక చనిపోయిన వారికోసం రాయిని తొలిచి చేసిన చిన్న గది. ఇందులో ఒక వైపున ఒక చదునైన స్థలం ఉంటుంది. అక్కడ వారు దానిపై నూనె, సుగంధ ద్రవ్యాలు వేసి, గుడ్డలో చుట్టిన తర్వాత శరీరాన్ని ఉంచుతారు. అప్పుడు వారు సమాధి ముందు ఒక పెద్ద బండను పెట్టేవారు, అందువల్ల ఎవరూ లోపలికి చూడలేరు లేదా ప్రవేశించలేరు.

ఈ అధ్యాయంలో ముఖ్యమైన ప్రసంగాలు

వ్యంగ్యం

సైనికులు, "" యూదుల రాజా జిందాబాద్! "" ([మత్తయి 27:29] (../../mat/27/29.md)) ఇది యేసును అపహాస్యం చేయడానికి. ఆయన యూదుల రాజు అని వారు అనుకోలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)