te_tn_old/mat/12/intro.md

3.5 KiB

మత్తయి 12 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

కొన్ని అనువాదాలు చదవడానికి వీలుగా పద్య భాగాన్ని కొంచెం కుడి వైపుకు ముద్రిస్తాయి. ULT లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు ఇలానే కనిపిస్తాయి. 12:18-21లో పాత నిబంధన నుండి ఎత్తిరాసిన మాటలు అలానే ఉన్నాయి.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

సబ్బాతు

ఈ అధ్యాయంలో దేవుని మనుషులు సబ్బాతును పాటించేదాని గురించి విస్తృతంగా రాసి ఉంది. యేసు పరిసయ్యులు చేసిన నియమాలు మనుషులు సబ్బాతును పాటించడం ఇంకా కష్టంగా చేస్తున్నాయి. (చూడండి: rc://*/tw/dict/bible/kt/sabbath)

""ఆత్మకు వ్యతిరేకంగా దైవదూషణ“

ఇది ఏమిటో ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. మనుషులు జరిగించే క్రియలా లేక మరొకటా? ఎలాటి మాటలు వారు పలికితే అది పాపం అవుతుంది? అయితే, వారు బహుశా పరిశుద్ధాత్మను, ఆయన పనిని అవమానపరిస్తే ఇలా జరుగుతుంది. పరిశుద్ధాత్మ చేసే పనిలో ఒక భాగం మనుషులు తాము పాపులమని అర్థం చేసుకునేలా చెయ్యడం. తమకు దేవుని క్షమాపణ అవసరమని వారు గ్రహించాలి. కాబట్టి, పాపం మానుకోని ఎవరైనా బహుశా ఆత్మకు వ్యతిరేకంగా దైవదూషణ చేస్తున్నారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/blasphemy]] మరియు [[rc:///tw/dict/bible/kt/holyspirit]])

ఇంకా ఇలా కూడా అనువాదం చెయ్యవచ్చు ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు

సోదరసోదరీలు

ఒకే తల్లిదండ్రులు ఉన్న మనుషులను ""సోదరుడు” “సోదరి"" అని పిలుచుకుంటారు. అలాటివారిని తమ జీవితాల్లో ప్రాముఖ్యమైన వారుగా చూస్తారు. కొందరు ఒకే తాతలు ఉన్న వారిని ""సోదరుడు” “సోదరి"" అని పిలుచుకుంటారు."" ఈ అధ్యాయంలోయేసు తనకు అలాటి ప్రాముఖ్యం మనుషులు పరలోకంలోని తన తండ్రికి లోబడే వారే అని చెప్పాడు.(చూడండి: rc://*/tw/dict/bible/kt/brother)