te_tn_old/mat/11/19.md

3.9 KiB

The Son of Man came

యేసు తనను గురించే మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్య కుమారుడినైన నేను. వచ్చాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

came eating and drinking

ఇది యోహాను ప్రవర్తనకు వ్యతిరేకం. దీని అర్థం కేవలం మామూలు ఆహారం పుచ్చుకోవడం, ద్రాక్ష రసం తాగడం మాత్రమే కాదు. యేసు అందరి లాగానే మంచి ఆహారం తినడం, ద్రాక్షరసం తాగడం ఇష్టంగా చేసే వాడు.

they say, 'Look, he is a gluttonous man and a drunkard ... sinners!'

దీన్ని ఇలా నేరుగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన తిండిబోతు, తాగుబోతు అంటున్నారు.” లేక “వారు అయన విపరీతంగా తిని తాగుతాడు అని నేరం మోపుతున్నారు.""మీరు ""మనుష్య కుమారుడు"" అనే దాన్ని ""మనుష్య కుమారుడు అయిన నేను"" అని తర్జుమా చేసినట్టయితే దీన్ని పరోక్ష ప్రతిపాదనగా ఉత్తమ పురుష లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను తిండిబోతునని, తాగుబోతునని అంటున్నారు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotations]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])

he is a gluttonous man

అతడు తిండిబోతు లేక “అస్తమానం విపరీతంగా తింటూ ఉంటాడు.

a drunkard

తాగుబోతు లేక “అస్తమానం మద్యం తాగుతూ ఉంటాడు.

But wisdom is justified by her deeds

ఈ పరిస్థితిని బట్టి యేసు ఈ సామెతను తనకు అన్వయించుకుంటున్నాడు. ఎందుకంటే మనుషులు తనను, యోహానును కూడా తిరస్కరించారు గనక అది జ్ఞానం అనిపించుకోదు. యేసు, బాప్తిస్మమిచ్చే యోహాను జ్ఞానులు. వారి చర్యల ఫలితాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

wisdom is justified by her deeds

ఇక్కడ ""జ్ఞానం"" అనే దాన్ని ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. ఆమె చేసిన దాన్ని బట్టి ఆమె సరి అయినది అని రుజువు అయింది. అంటే ఒక జ్ఞానవంతుని క్రియల ఫలితాలే అతడు నిజంగా జ్ఞాని అని రుజువు చేస్తాయి. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక జ్ఞాని చర్యల ఫలితాలు అతణ్ణి జ్ఞాని అని నిరూపిస్తాయి."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])