te_tn_old/mat/03/intro.md

2.1 KiB

మత్తయి 03 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

కొన్ని అనువాదాలు పాత నిబంధన వచనాలను మిగతా భాగం కన్నా కాస్త కుడి వైపున ముద్రించాయి. ULT లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు ఇలానే కనిపిస్తాయి. వ. 3.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

""పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి.""

ఫలం అనేది లేఖనాల్లో వాడిన సాధారణ పదం. రచయితలు మంచి లేక చెడు ప్రవర్తన ఫలితాలను వర్ణించడానికి ఈ పదం వాడారు. ఈ అధ్యాయంలో మంచి ఫలం అంటే దేవుని అజ్ఞల ప్రకారం నడుచుకున్న దాని ఫలితం. (చూడండి: rc://*/tw/dict/bible/other/fruit)

ఇంకా ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు

""దేవుని రాజ్యం దగ్గరగా ఉంది.""

యోహాను ఈ మాట పలికినప్పుడు ""దేవుని రాజ్యం"" నెలకొని ఉన్నదో లేక రాబోతున్నదో తెలియదు. ఇంగ్లీషు అనువాదాలు తరచుగా “సమీపించింది” అనే పదబంధం ఉపయోగిస్తుంది. కానీ ఈ మాటలు తర్జుమా చెయ్యడం కష్టం. ఇతర వాచకాలు “దగ్గర పడింది” “వస్తూ ఉంది” వంటి పదబంధాలు వాడుతున్నాయి.