te_tn_old/mat/01/intro.md

2.1 KiB

మత్తయి 01 సామాన్య వ్యాఖ్య

నిర్మాణం, ఆకృతి

కొందరు కొన్ని అనువాదాలు పాతనిబంధనలోని కొన్ని వచనాలను ఎత్తి రాసేటప్పుడు పేజీలో కొద్దిగా కుడి వైపున వచ్చేలా రాస్తారు. ULT 1:23 దగ్గర ఇలా చేసింది.

ఈ అధ్యాయంలో ప్రత్యేక అంశాలు

వంశావళి

వంశావళి అంటే ఒక మనిషి పూర్వీకుల జాబితా. యూదులు ఈ వంశావళులను ఎవరు రాజు కావాలి అని నిర్ణయించడం కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే రాజు కొడుకే రాజు కావాలి. ముఖ్యమైన మనుషులు తమ వంశావళులను రాసి పెట్టుకుంటారు.

ఈ అధ్యాయంలో ముఖ్యమైన భాషాలంకారాలు

కర్మణి వాక్య ప్రయోగాలు

కర్మణి వాక్య ప్రయోగాలు ఈ అధ్యాయంలో మత్తయి ఉద్దేశ పూర్వకంగా చేశాడు. మరియకు ఎవరితోనూ లైంగిక సంబంధం లేదని చెప్పడం ఇందులో ఉద్దేశం. ఆమె పరిశుద్ధాత్మ మూలంగా యేసును గర్భంలో ధరించింది. ఇది అద్భుతం. అనేక భాషల్లో కర్మణి వాక్యాలు ఉండవు. కాబట్టి అనువాదకులు అలాటి భాషల్లో ఇదే సత్యాలను వెల్లడించడానికి మార్గాలు వెదకాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)