te_tn_old/luk/23/intro.md

3.8 KiB

లూకా 23 సాధారణ వివరణలు

నిర్మాణమూ, రూపం

ఈ అధ్యాయం చివరి పంక్తిని యు.యల్.టి.(ULT)వేరుగా ఉంచుతుంది. ఎందుకంటే ఇది 23 వ అధ్యాయంతో పోలిస్తే 24 వ అధ్యాయంతో ఎక్కువ సంబంధం కలిగి వుంటుంది.టి

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

నిందారోపణ చేయడం

ప్రధాన యాజకులూ, శాస్త్రులు యేసు చెడు చేశాడని ఆరోపిస్తూ, యేసును చంపమని పిలాతును కోరడం. వారు యేసుపై తప్పుగా నిందలు మోపారు, ఎందుకంటే యేసు వారు ఆరోపించినది ఎప్పుడూ చేయలేదు. వారు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేశారు.

""దేవాలయపు తెర రెండుగా విభాగించడమైనది""

దేవాలయంలోని తెర ఒక ముఖ్యమైన సంకేతానికి గుర్తు, అది ప్రజలతరుపున ఎవరైన దేవునితో మాట్లాడటం అవసరమని సూచిస్తుంది. ప్రజలందరూ పాపులని, దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నందున వారు నేరుగా దేవునితో మాట్లాడలేరు. యేసు ప్రజలు ఇప్పుడు దేవునితో నేరుగా మాట్లాడవచ్చు, ఎందుకంటే యేసు వారి పాపాలకు వెల చెల్లించినందున, ప్రజలు ఇప్పుడు దేవునితో నేరుగా మాట్లాడవచ్చని చూపడానికి దేవుడు తెరను రెండుగా చీల్చాడు.

సమాధి

యేసును భూస్థాపన చేసిన సమాధి ([లూకా 23:53] (../../luk/23/53.md)) ధనవంతులైన యూదా కుటుంబాల వారు చనిపోయిన తమ వారిని ఖననం చేసే సమాధి. ఇది తొలచిన ఒక రాతిగది. ఇది ఒక వైపున ఒక చదునైన స్థలాన్ని కలిగి ఉంటుంది, అక్కడ వారు దానిపై నూనె, సుగంధ ద్రవ్యాలు వేసి, గుడ్డలో చుట్టిన తర్వాత చనిపోయిన వాని శరీరాన్ని ఉంచవచ్చు. అప్పుడు వారు సమాధి ముందు ఒక పెద్ద బండను దొర్లించే వారు, కాబట్టి ఎవరూ లోపలకు చూడలేరు లేదా ప్రవేశించలేరు.

ఈ అధ్యాయంలో ఉన్న ఇతర అనువాద ఇబ్బందులు

""ఈ మనిషిలో నాకు ఏ దోషమూ కానరాలేదు""

యేసు ఎటువంటి చట్టాలను ఉల్లంఘించనందున, ఎందుకు శిక్షించాలో తనకు తెలియదని పిలాతు చెప్పాడు. యేసు పరిపూర్ణుడు అని పిలాతు అనలేదు.