te_tn_old/luk/22/intro.md

2.5 KiB

లూకా 22 సాధారణ వివరణలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

శరీరాన్నితినడం మరియు రక్తాన్ని తాగడం

[లూకా 22:19-20] (./19.md) యేసు తన అనుచరులతో చేసిన చివరి భోజనాన్ని వివరిస్తుంది. ఈ సమయంలో, యేసు వారు తినడాన్నీతన శరీరమూ, త్రాగడాన్నీ తన రక్తం అని చెప్పాడు. ఈ భోజనాన్ని జ్ఞాపకం చేసుకోడానికి దాదాపు అన్ని క్రైస్తవ సంఘాలు ""ప్రభువు భోజనం"", ""ప్రభు సంస్కారం"" లేదా ""పవిత్ర సహవాసం""గా జరుపుకుంటారు.

క్రొత్త నిబంధన

కొందరు యేసు భోజన సమయంలో క్రొత్త నిబంధనను స్థాపించాడని అనుకుంటారు. ఆయన పరలోకానికి వెళ్ళిన తరువాత దానిని స్థాపించాడని ఇతరులు భావిస్తారు. మరికొందరు ఇది యేసు తిరిగి వచ్చేంత వరకు అది స్థాపించడం జరగదని అనుకుంటారు. యు.యల్.ట్. ULT కంటే మించి మీరు ఎక్కువ అనువాదం చేయకూడదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/covenant)

ఈ అధ్యాయంలో సాధ్యమయ్యే ఇతర అనువాద ఇబ్బందులు

""మనుష్యకుమారుడు""

ఈ అధ్యాయంలో యేసు తనను తాను ""మనుష్యకుమారుడు"" అని పేర్కొన్నాడు ([లూకా 22:22] (../../luk/22/22.md)). మీ భాషలోని ప్రజలు తమ గురించి తాము, వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా చెప్పకోవడాన్ని అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])