te_tn_old/luk/19/intro.md

7.2 KiB

లూకా 19 వ అధ్యాయం: సాధారణ వివరణలు

నిర్మాణమూ,దాని రూపం

జక్కయ్య అనే వ్యక్తి తన పాపాల విషయమై పశ్చాత్తాపపడడానికి యేసు సహాయపడిన తరువాత ([లూకా 19: 1-10] (./01.md)), ఆయన తన అనుచరులతో, తాను రాజుగా పరిపాలన ప్రారంభించినప్పుడు, తాను వారికి అప్పగించిన పనుల విషయంలో ఏవిధంగా చేసారో జాగ్రత్తగా తిరిగి అప్పగించాల్సిన అవసరతను గురించి నేర్పించాడు([లూకా 19: 11-27] (./11.md)). ఆయన వారికి ఒక ఉపమానం చెప్పి ఇలా చేశాడు. ఆ తరువాత, ఆయన ఒక గాడిద పిల్లపై యెరూషలేములోకి వెళ్ళాడు ([లూకా 19: 28-48] (./28.md)). (చూడండి: [[rc:///tw/dict/bible/kt/kingdomofgod]]మరియు [[rc:///ta/man/translate/figs-parables]])

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

""పాపి""

పరిసయ్యులు ప్రజల సమూహాన్ని పరిసయ్యులు ""పాపులు"" గా ప్రస్తావించారు. యూదా నాయకులు ఈ ప్రజలు పాపులని భావించారు, అయితే వాస్తవానికి నాయకులు కూడా పాపులే. దీనిని వ్యంగ్యంగా తీసుకోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sin]]మరియు [[rc:///ta/man/translate/figs-irony]])

సేవకులు

ప్రపంచంలోని ప్రతిదీ దేవునికి చెందినవని తన ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన ఆశించాడు. దేవుడు తన ప్రజలకు వస్తువులను ఇస్తాడు, కనుక వారు ఆయనకు సేవ చేయాలి. ఆయన వారికి ఇచ్చిన ప్రతిదానితో వారు ఏమి చేయాలనుకుంటున్నారో, దానిని చేయడం ద్వారా వారు తనను సంతోషపెట్టాలని ఆయన కోరుకుంటాడు. యేసు ఒక దినాన ఉపయోగించమని తాను ఇచ్చిన ప్రతిదానితో ఏమి చేసారని అడుగుతాడు. ఆయన కోరుకున్నది చేసిన వారికి ఆయన బహుమానాన్ని ఇస్తాడు, ఆ విధంగా చేయని వారిని శిక్షిస్తాడు.

గాడిద మరియు గాడిదపిల్ల

యేసు ఒక దానిపై ఎక్కి స్వారి చేస్తూ యెరూషలేములోకి వెళ్ళాడు. ఈ విధంగా ఒక రాజు గొప్ప యుద్ధంలో గెలిచిన తరువాత పట్టణంలో ప్రవేశించిన రీతిగా ఆయన ఉన్నాడు. అలాగే, పాత నిబంధనలోని ఇశ్రాయేలు రాజులు గాడిదలపై స్వారి చేశారు. ఇతర రాజులు గుర్రాలపై ఎక్కి స్వారి చేశారు. కాబట్టి యేసు తాను ఇశ్రాయేలు రాజునని, ఇతర రాజుల మాదిరి కానని కనపరచాడు.

మత్తయి, మార్కు, లూకా, యోహానులందరూ ఈ సంఘటన గురించి రాశారు. శిష్యులు గాడిదను యేసు దగ్గరకు తీసుకు వచ్చారని మత్తయి, మార్కు రాశారు. యేసు ఒక చిన్న గాడిదను కనుగొన్నట్లు యోహాను రాశాడు. శిష్యులు ఒక గాడిద పిల్లను ఆయన దగ్గరకు తోలుకు వచ్చారని లూకా రాశాడు. మత్తయి మాత్రమే గాడిద, గాడిద పిల్ల రెండు ఉన్నాయి అని రాశాడు. యేసు గాడిదను లేదా గాడిద పిల్లపై ఎక్కి స్వారీ చేశాడో ఎవరికీ తెలియదు. ఈ విషయాలన్నింటినీ యు.ఎల్.టి(ULT) లో కనిపించే విధంగా అనువదించడం ఉత్తమం. (చూడండి: మత్తయి 21:1-7 మరియు మార్కు 11:1-7మరియు లూకా 19:29-36మరియు యోహాను 12:14-15)

బట్టలనుమరియు కొమ్మలను పరచడం

ఒకరాజు తాను పరిపాలించే నగరాల్లోకి ప్రవేశించినప్పుడు, అక్కడి ప్రజలు చెట్ల నుండి కొమ్మలను నరికి, చల్లని వాతావరణంలో వెచ్చగా ఉండటానికి వారు ధరించిన దుస్తులను తీసుకొచ్చి, వాటిని దారిలో పరిచేవారు, అప్పుడు రాజు వాటిపై సవారీ చేస్తూ ప్రయాణించేవాడు. ఈ విధంగా వారు రాజును గౌరవిస్తున్నామని, ఆయనను ప్రేమిస్తున్నామని కనపరచేందుకు ఇలా చేసారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/honor]] మరియు [[rc:///ta/man/translate/translate-symaction]])

దేవాలయంలోని వ్యాపారస్తులు

దేవాలయంలో గొర్రెలు, ఎద్దుల వంటి పశువులను క్రయవిక్రయాలు చేసేవారిని యేసు బలవంతంగా వెళ్లగొట్టాడు. దేవాలయంపై తనకు అధికారం ఉందని, దేవుడు చెప్పిన మంచిని చేసే నీతిమంతులు మాత్రమే అందులో ఉంటారని అందరికీ చూపించడానికే ఆయన ఈ విధంగా చేశాడు. (చూడండి:rc://*/tw/dict/bible/kt/righteous)