te_tn_old/luk/14/intro.md

2.6 KiB

లూకా 14 సాధారణ వివరణలు

నిర్మాణం, రూపం

3 వ వచనం ఇలా చెబుతోంది, ""యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?” అని పరిసయ్యులను అడిగాడు."" అనేక సార్లు, విశ్రాంతి దినమున స్వస్థ పరచినందుకు పరిసయ్యులు యేసును కోపపడ్డారు. ఈ వచనభాగంలో యేసు పరిసయ్యులను మౌనంగా చేసాడు. సాధారణంగా పరిసయ్యులే యేసును వలలో వేయడానికి ప్రయత్నించారు.

అంశంలో మార్పులు

ఈ అధ్యాయంలో అనేక సార్లు లూకా మార్పులను గుర్తించకుండా ఒక అంశం నుండి మరొక అంశానికి మార్చుతూ వచ్చాడు.

ఈ అధ్యాయంలో ముఖ్య భాషా రూపాలు

ఉపమానం

దేవుని రాజ్యం ప్రతి ఒక్కరూ ఆస్వాదించగలిగేదిగా ఉంటుందని బోధించడానికి యేసు [లూకా 14: 15-24] (./15.md) లోని ఉపమానాన్ని చెప్పాడు. అయితే ప్రజలు అందులో భాగం కావడానికి నిరాకరించారు (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]]మరియు [[rc:///tw/dict/bible/kt/kingdomofgod]])

ఈ అధ్యాయంలో సాధ్యమయ్యే ఇతర అనువాద ఇబ్బందులు

వైపరీత్యం

ఒక వైపరీత్యం అనేది అసాధ్యమైన దానిని వివరించడానికి కనిపించే వాస్తవమైన ప్రకటన. ఈ అధ్యాయంలో ఒక వైపరీత్యం సంభవిస్తుంది: ""తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.” ([లూకా 14:11] (../../luk/14/11.md)).