te_tn_old/luk/11/intro.md

3.6 KiB

లూకా 11 సాధారణ వివరణలు

నిర్మాణం, రూపం

యు.ఎల్.టి(ULT) 11:2-4లోని పంక్తులను మిగిలిన వచనం కంటే పేజీలో కుడి వైపున అమర్చుతుంది ఎందుకంటే అది ప్రత్యేక ప్రార్థన.

ఈ అధ్యాయంలో ప్రత్యేక అంశాలు

ప్రభువు ప్రార్థన

యేసుప్రభువు శిష్యులు ప్రార్థన ఎలా చేయాలో నేర్పమని అడిగినప్పుడు, ఆయన వారికి ఈ ప్రార్థన నేర్పించాడు. వారు ప్రార్థించినప్పుడెల్లా అవే మాటలు ఉపయోగించాలని ఆయన కోరలేదు, గాని దేవుడు ఏఏ విషయాలను గూర్చి ప్రార్ధన చేయమని కోరుకుంటున్నది వారు తెలుసుకోవాలని ఆయన కోరుకున్నాడు.

యోనా

యోనా పాత నిబంధన ప్రవక్త, అన్యుల పట్టణమైన నినేవె వారి దగ్గరకు పశ్చాతాపము చెందమని చెప్పడానికి పంపబడ్డాడు. పశ్చాత్తాపం చెందమని ఆయన చెప్పినప్పుడు వారు పశ్చాత్తాపడ్డారు.(చూడండి:[[rc:///tw/dict/bible/kt/prophet]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు rc://*/tw/dict/bible/kt/repent)

వెలుగు మరియు చీకటి

బైబిలు తరచూ దుష్టులను గూర్చి మాట్లాడుతున్నది, వారు అంధకారములో తిరుగులాడుతున్నారు, దేవునిని సంతోషపరచేవాటిని చేయనివారు. పాపపు ప్రజలు నీతిమంతులగునట్లుగాను, వారు చేస్తున్నది తప్పు అని గ్రహించి దేవునికి విదేయత చూపేదిగా వెలుగును గురించి చెపుతుంది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/righteous)

శుద్ధిచెయ్యడం

పరిసయ్యులు తమ్మును తాము కడుగుకొందురు, వారు తినిన వస్తువులను కడుగుతారు. వారు మురికిగా లేని వస్తువులను కూడా కడుగుతారు. మోషే ధర్మశాస్త్రం ఈ వస్తువులను కడగమని చెప్పలేదు, అయితే వారు కడుగుతారు. తద్వారా దేవుడు నియమించిన నియమాలూ, దేవుడు నియమించని నియమాలకు లోబడడం ద్వారా వారు మంచి వ్యక్తులు అని దేవుడు తలస్తాడని అనుకొంటారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] మరియు [[rc:///tw/dict/bible/kt/clean]])