te_tn_old/luk/07/24.md

1.9 KiB

Connecting Statement:

బాప్తిస్మమిచ్చు యోహాను గురించి యేసు జనసమూహంతో మాట్లాడటం ప్రారంభించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను నిజంగా ఏవిధంగా ఉంటాడో ఆలోచించటానికి వారిని నడిపించేందుకు ఆయన అలంకారిక ప్రశ్నలు అడుగుతున్నాడు.

What ... A reed shaken by the wind?

దీనికి ప్రతికూల జవాబు వస్తుంది. ""గాలిలో ఎగిరే ఒక రెల్లును చూడడానికి మీరు బయటికి వెళ్ళారా? దానికోసం వెళ్ళలేదు!"" ఇది ఒక ప్రకటనగా కూడా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""గాలిలో ఎగిరే ఒక రెల్లును చూడడానికి మీరు ఖచ్చితంగా బయటకు వెళ్ళలేదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

A reed shaken by the wind

ఈ రూపకంలో సాధ్యమయ్యే అర్ధాలు 1) గాలి చేత సులభంగా కదిలే రెల్లులా తన మనస్సును తేలికగా మార్చుకునే వ్యక్తి, లేదా 2) గాలి వీచేటప్పుడు గలగలా లాడే రెల్లులా అధికంగా మాట్లాడుతూ ప్రాముఖ్యమైనదేదీ చెప్పని వ్యక్తి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)