te_tn_old/luk/05/intro.md

6.8 KiB

లూకా 05 సాధారణ వివరణ

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

""మీరు మనుష్యులను పట్టుకొను వారుగా ఉంటారు.""

పేతురు, యాకోబు, యోహాను చేపలు పట్టేవారు. వారు మనుష్యులను పట్టుకుంటారని యేసు వారికి చెప్పినప్పుడు, ఆయనను గురించిన విశ్వసించడంలో ప్రజలకు సహాయం చేయాలని ప్రభువైన యేసు కోరుకుంటున్నట్లు చెప్పడానికి ఒక రూపకాన్ని ఉపయోగిస్తున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/disciple]]మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

పాపులు

యేసు కాలంలో “పాపులను”గురించి మాట్లాడినప్పుడు, మోషే ధర్మశాస్త్రానికి విధేయత చూపని వారిని గురించి వారు మాట్లాడడం లేదు దానికి బదులు దొంగతనం, లైంగిక సంబంధ పాపాలను గురించి మాట్లాడుతున్నారు. ”పాపులను” పిలవడానికి తాను వచ్చానని ప్రభువైన యేసు చెప్పినప్పుడు తాము పాపులము అని నమ్మిన వ్యక్తులు మాత్రమే ఆయన అనుచరులు కాగలరని ఆయన ఉద్దేశం. చాలా మంది మనుషులు తమకు తాము ""పాపులు"" గా భావించకపోయినా ఇది నిజం. (చూడండి: rc://*/tw/dict/bible/kt/sin)

ఉపవాసం మరియు విందు

మనుషులు విచారంగా ఉన్నప్పుడు లేదా తమ పాపాల విషయంలో పశ్చాత్తాపాన్ని దేవునికి చూపిస్తున్నప్పుడు మనుషులు ఉపవాసం చేస్తారు, లేదా ఎక్కువసేపు ఆహారం తినరు. వారు సంతోషంగా ఉన్నప్పుడు, వివాహాల మాదిరిగానే, వారికి విందులు లేదా భోజనం చేస్తారు, అక్కడ వారు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. (చూడండి: rc://*/tw/dict/bible/other/fast)

ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన భాషా రూపాలు

ఊహాత్మక పరిస్థితి

పరిసయ్యులను ఖండించడానికి యేసు ఒక ఊహాత్మక పరిస్థితిని వినియోగించాడు. ఈ వాక్యభాగంలో ""మంచి ఆరోగ్యవంతులుగా ఉన్న మనుషులు,"" ""నీతిమంతులుగా ఉన్న మనుషులు"" ఉన్నారు. యేసు అవసరం లేని వ్యక్తులు ఉన్నారని దీని అర్థం కాదు. ""నీతిమంతులు"" లేరు, ప్రతి ఒక్కరికి యేసు అవసరం. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo మరియు [లూకా 5:31-32] (./31.md))## ఈ అధ్యాయంలో ఇతర అనువాద ఇబ్బందులు

అంతర్గత సమాచారం

ఈ అధ్యాయం యొక్క అనేక భాగాలలో రచయిత తన ఆరంభ పాఠకులు అర్థం చేసుకుని, ఆలోచించేవారని కొంత వివరించే సమాచారాన్ని విడిచిపెట్టాడు. ఆధునిక పాఠకులకు అలాంటి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కాబట్టి రచయిత తెలియపరుస్తున్న సమాచారాన్నంతటినీ అర్థం చేసుకోవడంలో వారికి ఇబ్బంది ఉండవచ్చు. ఆధునిక పాఠకులు ఆ భాగాలను అర్థం చేసుకోగలిగేలా ఆ సమాచారాన్ని ఎలా అందించవచ్చో యు.ఎస్.టి(UST) తరచుగా చూపిస్తుంది. (చూడండి: [[rc:///ta/man/translate/translate-unknown]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

గత సంఘటనలు

ఈ అధ్యాయం భాగాలు ఇప్పటికే జరిగిన సంఘటనల క్రమంగా ఉన్నాయి. సంఘటనలు అప్పటికే జరిగినట్లుగానూ ఇతర సంఘటనలు ఇంకా పురోగతిలో ఉన్నట్టుగా (ఆయన వ్రాసే సమయానికి అవి పూర్తయినప్పటికీ) లూకా కొన్నిసార్లు వ్రాసాడు. ఇది సంఘటనల విషయంలో తర్క విరుద్ధ క్రమాన్ని సృష్టించడం ద్వారా అనువాదంలో ఇబ్బందులను కలిగిస్తుంది. అన్ని సంఘటనలు ఇప్పటికే జరిగినట్లుగా వ్రాయడం ద్వారా వీటిని స్థిరంగా ఉంచడం అవసరం కావచ్చు.

""మనుష్యకుమారుడు""

యేసు ఈ అధ్యాయంలో తనను తాను ""మనుష్యకుమారుడు"" అని పేర్కొన్నాడు ([లూకా 5: 24] (../../luk/05/24.md)). వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా మనుషులు తమను గురించి తాము మాట్లాడటానికి మీ బాష అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])