te_tn_old/luk/03/17.md

2.3 KiB

His winnowing fork is in his hand

తూర్పారపట్టే చేట ఆయన చేతిలో ఉంది, ఎందుకంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రజలను తీర్పు తీర్చడానికి క్రీస్తు పొట్టు నుండి గోధుమలను వేరు చేస్తున్న వ్యవసాయకునిలా వస్తున్నట్లు యోహాను మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను సిద్ధంగా ఉన్న వ్యయసాయకునిలా ప్రజలను తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

winnowing fork

గోధుమ ధాన్యాన్ని పొట్టు నుండి వేరు చేయడానికి గోధుమలను గాలిలోకి విసిరేయడానికి ఇది ఒక సాధనం. బరువుగా ఉన్న ధాన్యం వెనక్కి పడిపోతుంది, అవాంఛిత పొట్టు గాలికి ఎగిరిపోతుంది. ఇది పంగల కర్ర మాదిరిగా ఉంటుంది.

to thoroughly clear off his threshing floor

నూర్పిడి కోసం గోధుమలను సిద్ధపరచిన ప్రదేశం నూర్పిడి నేల. నేలను “శుభ్రం చెయ్యడం” అంటే ధాన్యాన్ని నూర్పిడి చేయడాన్ని ముగించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన ధాన్యాన్ని నూర్పిడి చేయడం పూర్తి చేయడానికి

to gather the wheat

భద్రపరచబడి, నిలువ ఉంచబడిన గోధుమ ఆమోదయోగ్యమైన పంట.

he will burn up the chaff

పొట్టు దేనికీ ఉపయోగపడదు, కాబట్టి మనుషులు దానిని కాల్చి వేస్తారు.