te_tn_old/jud/front/intro.md

3.4 KiB
Raw Permalink Blame History

యూదా పత్రిక పరిచయం

భాగ1: సాధారణ పరిచయం

యూదా పుస్తకం యొక్క గ్రంధ విభజన

  1. పరిచయం (1: 1-2)
  2. అబద్ద బోధకులకు వ్యతిరేకంగా హెచ్చరిక (1: 3-4)
  3. పాత నిబంధన ఉదాహరణలు (1: 5-16)
  4. సరైన ప్రతిస్పందన (1: 17-23)
  5. దేవునికి స్తుతులు (1: 24-25)

)

యూదా పుస్తకాన్ని ఎవరు రాశారు?

రచయిత తనను తాను యాకోబు సోదరుడు యూదా అని పరిచయం చేసుకున్నాడు. యూదా మరియు యాకోబు ఇద్దరూ యేసు అర్ధ సోదరులు. ఈ లేఖ ఏదైనా నిర్దిష్ట సంఘం కోసం ఉద్దేశించబడిందో తెలియదు.

యూదా పుస్తకం దేని గురించి?

అబద్ద బోధకులకు వ్యతిరేకంగా విశ్వాసులను హెచ్చరించడానికి యూదా ఈ లేఖ రాశాడు. యూదా తరచుగా పాత నిబంధనను సూచించాడు. యూదా యూదులైన క్రైస్తవ ప్రేక్షకులకు వ్రాస్తున్నట్లు ఇది సూచిస్తుంది. ఈ పత్రిక మరియు 2 పేతురు పత్రికలో ఒకే సమాచారం ఉంది. వారిద్దరూ దేవదూతలు, సొదొమ మరియు గొమొర్రా మరియు తప్పుడు బోధకుల గురించి మాట్లాడారు.

ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించవచ్చు?

తర్జుమాదారులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక ""యూదా"" అని పిలవడానికి ఎంచుకోవచ్చు. లేదా వారు ""యూదా నుండి పత్రిక"" లేదా ""యూదా రాసిన పత్రిక"" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక అంశాలు

యూదా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు?

యూదా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు గ్నోస్తికులు (జ్ఞానవాదులు) అని పిలవబడేవారు. ఈ బోధకులు తమ స్వలాభంకోసం లేఖనబోధలను వక్రీకరించారు. వారు అనైతిక మార్గాల్లో జీవించారు మరియు ఇతరులకు అదే విధంగా చేయమని నేర్పించారు.