te_tn_old/jhn/06/intro.md

5.4 KiB

యోహాను సువార్త 04వ అధ్యాయంలోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

రాజు

ఒక దేశపు రాజు ఆ దేశములో అత్యంత ఐశ్వర్యవంతుడు మరియు శక్తివంతుడైయున్నాడు. ప్రజలు తమకు ఆహారం ఇచ్చినందున యేసు తమకు రాజు కావాలని ప్రజలు కోరుకున్నారు, అందువలన ఆయన యూదులను ప్రపంచములోని అత్యంత ఐశ్వర్యవంతులుగా మరియు శక్తివంతమైన దేశంగా చేస్తాడని వారు భావించారు. యేసు చనిపోవడానికి వచ్చాడు కాబట్టి దేవుడు తన ప్రజల పాపాలను క్షమించగలడని మరియు లోకం దేవుని ప్రజలను హింసించేదని వారికి అర్థం కాలేదు.

ఈ అధ్యాయములోని ముఖ్యమైన రూపకఅలంకారములు

రొట్టె

యేసు రోజుల్లో రొట్టె చాల సాధారణమైన ముఖ్యమైన ఆహారం, కాబట్టి “రొట్టె” అనే మాట వారి సాధారణమైన మాటలలో “ఆహారం” అని చెప్పేవారు. రొట్టె అనే మాటను రొట్టె తినని ప్రజల భాషలోకి అనువదించడం చాలా కష్టం, ఎందుకంటే కొన్ని భాషలలో ఆహారం అనే సాధారణ మాట యేసు సంస్కృతిలో లేని ఆహారం గురించి తెలియచేస్తుంది. యేసు తన గురించి తాను తెలియపరచుటకు “రొట్టె” అనే మాటను ఉపయోగించారు. నిత్యజీవమును పొందుటకై వారు తనకు అవసరమని వారు అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])

మాంసం తినడం మరియు రక్తం త్రాగాడం

మీరు మనుష్యకుమారుని మాంసాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగకపోతే మీలో మీకు జీవం ఉండదు” అని యేసు చెప్పినప్పుడు, ఆయన చనిపోయే ముందు రొట్టె తినడం మరియు ద్రాక్షరసం త్రాగడం ద్వారా దీనిని చేయమని తన శిష్యులతో చెపుతాడని అతనికి తెలుసు. ఈ అధ్యాయము వివరించిన సందర్భంలో అతను ఒక రూపకఅలంకారమును ఉపయోగిస్తున్నాడని వినువారు అర్థం చేసుకుంటారని అతను అనుకున్నాడు కాని రూపకఅలంకారము దేని గురించి తెలియచేస్తుందో అర్థం కాలేదు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/flesh]] మరియు [[rc:///tw/dict/bible/kt/blood]])

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

నిక్షిప్త ఆలోచనలు

ఈ వాక్య భాగములో చాలాసార్లు యోహాను దేని గురించో వివరించాడు లేక కథను బాగా అర్థం చేసుకోవడానికి చదవరికి కొన్ని సందర్భాలను ఇస్తాడు. వివరణ యొక్క ప్రవాహానికి ఆటంకమేమియు లేకుండా అధికమైన జ్ఞానం ఇవ్వడానికి ఈ వివరణ ఉద్దేశించబడింది. ప్రకటన నిక్షిప్తములో ఉంచబడుతుంది.

\n“మనుష్య కుమారుడు”

ఈ అధ్యాయములో యేసు తనను తానూ “మనుష్యకుమారుడు” అని తెలియచేస్తున్నాడు (యోహాను సువార్త 6;26). మీ భాష వారు వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా తమను తాము మాట్లాడటానికి అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])