te_tn_old/jas/04/01.md

3.7 KiB

General Information:

ఈ భాగములో “మీలో,” “మీకు,” మరియు “మీరు” అనే పదాలు బహువచనములు, యాకోబు రాస్తున్న విశ్వాసులను సూచిస్తున్నాయి.

Connecting Statement:

ఈ విశ్వాసులలో తగ్గింపు లేకపోవడాన్ని బట్టి, వారి లోకానుసారమైన జీవితాన్ని బట్టి వారిని గద్దిస్తున్నాడు. ఒకరి గురించి ఒకరు వారు మాట్లాడుతున్నదానిని గమనించుకోవాలని వారిని బతిమాలుతున్నాడు.

Where do quarrels and disputes among you come from?

“తగాదాలు”, “అభిప్రాయ భేదాలు” అనే భావనామాలు ప్రాధమికంగా ఒకే అర్థాన్ని కలిగియున్నాయి, వాటిని క్రియా పదాలుగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీలో తగాదాలు, అభిప్రాయ భేదాలు ఎందుకు ఉన్నాయి?” లేక “మీలో మీరు ఎందుకు గొడవపడుచున్నారు?” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

Do they not come from your desires that fight among your members?

యాకోబు తన పాఠకులను గద్దించుటకు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని ఒక వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అవన్నియు మీ దుష్ట కోరికలనుండే వస్తున్నాయి, మీ మధ్యలోనే ఆ కోరికలు పోట్లాడుచున్నాయి.” లేక “దుష్ట కార్యాలకోసం మీ ఆశలనుండే అవి వస్తున్నాయి, మీ మధ్యలోనే ఆ ఆశలు తగాదా పడుతున్నాయి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Do they not come from your desires that fight among your members?

శత్రువులుగా విశ్వాసులకు విరుద్ధముగా యుద్ధాలు చేసే కోరికలను గురించి యాకోబు యాకోబు మాట్లాడుచున్నాడు. వాస్తవానికి, ఈ ఆశలు కలిగియున్న ప్రజలే వారిలో తగాదాలు పడుచున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దుష్టక్రియల కోసం మీ కోరికలనుండే అవి వస్తున్నాయి, తద్వారా మీరు చివరికి ఒకరికొకరు హాని చేసికొందురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

among your members

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు: 1) స్థానిక విశ్వాసుల మధ్య పోరాటం ఉంది, లేక 2) విశ్వాసులైన ప్రతియొక్కరిలో పోరాటం, సంఘర్షణలు ఉన్నాయి.