te_tn_old/jas/02/intro.md

4.2 KiB

యాకోబు 02 సాధారణ వివరణ

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

పక్షపాతము

యాకోబు పాఠకులలో కొందరు గొప్పవారినీ, శక్తివంతమైన ప్రజలనూ గౌరవించి, పేదవారిని తక్కువగా చూసారు. దీనిని పక్షపాతం అంటారు, ఇలా చేయడం తప్పని యాకోబు వారికి చెప్పుచున్నాడు. తన ప్రజలు గొప్పవారినీ, పేదవారినీ సరిగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు.

నీతిమంతులుగా తీర్చబడడం

నీతిమంతులుగా తీర్చబడడం అంటే దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడుగా చెయ్యడం. మనుష్యులు విశ్వాసం కలిగియుండడంతో పాటు మంచికార్యాలను చేసేవారిని నీతిమంతులుగా చేస్తున్నాడు లేక సమర్దిస్తున్నాడు అని ఇక్కడ యాకోబు చెపుతున్నాడు. (చూడండి [[rc:///tw/dict/bible/kt/justice]], [[rc:///tw/dict/bible/kt/righteous]])

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర ఇబ్బందులు

క్రోడీకరించిన గుర్తులు

”క్రియలులేకుండా మీ విశ్వాసమును చూపించండి, నేను నా క్రియలు ద్వారా నా విశ్వాసమును మీకు చూపిస్తాను” అనే ఈ మాటలను అర్థము చేసికొనుట కష్టమే. పైన క్రోడీకరించిన వాక్యాలవలే “ఇతరులు చెప్పిన విధంగా” అని కొందరు చెపుతారు. ఆ “మరొకని”తో యాకోబు తిరిగి చెపుతున్నట్టుగానే అనేక అనువాదాలు వాటిని తర్జుమా చేసాయి.

“నీవు కలిగియున్నావు... నేనుకలిగియున్నాను”

”నీకుంది ...నాకుంది”

”నీవు” నేను”, “నేను” అనే పదాలు “కొంతమంది ప్రజలు” లేక “ఇతరప్రజలు” అనే పదాలకు అన్యాపదేశం అని చెపుతారు. వారు చెప్పినది సరియైనదై, 18ఫ వచనము ఇలా ఉండవచ్చు, “కొంతమంది విశ్వాసమును కలిగియుంటారు, ఇతర ప్రజలు క్రియలను కలిగియుంటారు. ఆ రెండింటిని అందరూ కలిగియుండరు.” తరువాతి వాక్యం “కొందరు చెప్పవచ్చు” అని ఉన్నట్లయితే దానిని “కొంతమంది తమ విశ్వాసమును క్రియలులేకుండా చూపిస్తారు, ఇద్దరికీ విశ్వాసం ఉంది” అని అనువదించవచ్చు. ఈ రెండు వాక్యములలో అదనపు వాక్యాన్ని జత చేసినప్పుడు మాత్రమే పాఠకుడు అర్థం చేసుకొంటాడు. యుఎల్.టి చేసినట్లుగా దీనిని తర్జుమా చేయడం ఉత్తమం. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/faith]], [[rc:///ta/man/translate/figs-metonymy]])