te_tn_old/heb/front/intro.md

15 KiB

హెబ్రీయులకు రాసిన పత్రిక పరిచయం)

భాగం 1: సాధారణ పరిచయం

హెబ్రీయులకు పత్రిక రూపు రేఖ

  1. ప్రభువైన యేసు దేవుని ప్రవక్తలూ, దేవదూతల కంటే ఉన్నతుడు. (1:1-4:13)
  2. యెరూషలేములోని దేవాలయములో యాజక సేవ చేసే యాజకులకంటే యేసు ఉన్నతుడు (4:14-7:18)
  3. దేవుడు తన ప్రజలతో చేసిన పాత నిబంధనకంటే యేసు పరిచర్య ఉన్నతమైనది (8:1-10:39)
  4. విశ్వాసం ఏవిధంగా ఉంటుంది (11:1-40)
  5. దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రోత్సాహం (12:1-29)
  6. ముగింపు ప్రోత్సాహకరమైన మాటలు, శుభములు (13:1-25)

హెబ్రీయులకు పత్రికను ఎవరు రాసారు?

హెబ్రీయులకు పత్రికను ఎవరు వ్రాశారో ఎవరికీ తెలియదు. ఈ పత్రిక గ్రంథకర్తను గురించి చెప్పాడానికి వేదాంత పండితులు ఎంతోమంది పేర్లను సూచించారు. ఆ గ్రంథకర్తలు పౌలు, లూకా, బర్నబా అయిఉండవచ్చు. ఈ పత్రికను వ్రాసిన కాలం కూడా ఎవరికీ తెలియదు. ఈ పత్రికను క్రీ.శ.70వ సంవత్సరంకు ముందు వ్రాసియుండవచ్చని పండితులు తలస్తున్నారు. యెరూషలేము క్రీ.శ.70వ సంవత్సరంలో నాశనం చేయబడింది, కాని పత్రిక గ్రంథకర్త యెరూషలేము అప్పటికి ఇంకా నాశనము కాలేదన్నట్లుగా చెపుతున్నాడు.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక దేనిని గూర్చి చెపుతుంది?

హెబ్రీయులకు పత్రికలో యేసు పాత నిబంధనలోనున్న ప్రవచనాన్నీ నెరవేర్చియున్నాడని గ్రంథకర్త చూపిస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్నవాటన్నికంటే యేసు గొప్పవాడని వివరించడానికీ, యూదా క్రైస్తవులను ప్రోత్సహించడానికీ గ్రంథకర్త ఈ పత్రికను రచించియున్నాడు. ప్రభువైన యేసు పరిపూర్ణమైన ప్రధాన యాజకుడు. యేసు సంపూర్ణ బలియర్పణ కూడా. యేసు బలిఅర్పణ అన్ని సమయాలకూ ఒకే ఒక్క సారి చెల్లించబడింది కనుక జంతు బలులు నిరూపయోగంగా మారాయి. అందుచేత ప్రజలు దేవుని చేత అంగీకరించబడడానికి ప్రభువైన యేసు ఒక్కడే ఏకైక మార్గం అయ్యాడు.

ఈ గ్రంథం పేరును ఏ విధముగా తర్జుమా చెయ్యబడింది?

అనువాదకులు సాంప్రదాయ శీర్షిక “హెబ్రీయులు” అని ఈ గ్రంథాన్ని పిలవడానికి ఎన్నుకొన్నారు. లేదా “హెబ్రీయులకు వ్రాసిన పత్రిక” లేక “యూదా క్రైస్తవులకు పత్రిక” అనే పేరును ఎన్నుకొనియుండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగం 2: ప్రాముఖ్యమైన మతసంబంధ, సాంస్కృతిక అంశాలు

పాతనిబంధనలోని యాజకుల కార్యాలూ, బలులను గురించిన అవగాహన లేకుండా పాఠకులు ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోగలరా?

ఈ అంశాలు అర్థం చేసుకోకుండా పాఠకులు ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. తర్జుమాదారులు పాతనిబంధన అంశాలను కొన్నింటిని నోట్సులో వివరించడానికి పరిశీలించవచ్చు, లేక ఈ గ్రంథ పరిచయంలో వివరించవచ్చు.

హెబ్రీయులకు వ్రాసిన పుస్తకములో రక్తమును గూర్చిన తలంపును ఏ విధంగా వినియోగించబడింది?

[హెబ్రీ.9:7] (../../హెబ్రీ/09/07.ఎం.డి) ఆరంభంలో దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన ప్రకారం బలిగా అర్పించబడిన జంతువు మరణాన్ని సూచించడానికి తరచుగా రక్తము అన్యాపదేశంగా వినియోగించబడింది. యేసుక్రీస్తు మరణాన్ని సూచించడానికి కూడా గ్రంథకర్త రక్తమును గూర్చిన తలంపును వినియోగించాడు. మునుష్యుల తనకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని దేవుడు క్షమించాడానికి యేసు పరిపూర్ణమైన బలిగా మారాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

[హెబ్రీ.9:19] (../../హెబ్రీ/09/19.ఎం.డి) ప్రారంభంలో చిలకరింపును ఒక గుర్తుగా గ్రంథకర్త ఉపయోగిస్తున్నాడు. పాత నిబంధన యాజకులు బలిగా అర్పించబడిన జంతువుల రక్తమును చిలకరించేవారు. ప్రజలకూ లేక వస్తువులకూ అన్వయించినప్పుడు జంతువు మరణము ద్వారా కలుగుప్రయోజనాలకు ఇది ఒక గుర్తు. ప్రజలూ, వస్తూ దేవునికి అంగీకారంగా ఉందని చూపిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

భాగం 3: ప్రాముఖ్యమైన తర్జుమా అంశాలు

యుఎల్.టిలోని హెబ్రీయులకు పత్రికలో “పరిశుద్ధత,” “పరిశుద్ధపరచడం”” అనే అంశాలు ఏ విధంగా చెప్పబడ్డాయి?

వివిధ తలంపులలో ఒక తలంపును సూచించడానికి లేఖనాలలో అటువంటి పదాలు ఉపయోగించబడ్డాయి.. ఈ కారణముచేత, తర్జుమాదారులు వారి వారి అనువాదములలో వాటిని స్పష్టంగా చూపించడం తరచూ కష్టంగా ఉంది. ఆంగ్లభాషలోనికి తర్జుమా చేయడంలో యుఎల్.టి ఈ క్రిందనున్న నియమాలను ఉపయోగించింది:

  • కొన్నిమార్లు వాక్యభాగములోని అర్థం నైతిక పరిశుద్ధతను తెలియజేస్తుంది. క్రైస్తవులు యేసుక్రీస్తునందు ఐక్యపరచబడినందున దేవుడు క్రైస్తవులను పాపములేనివారుగా చూస్తాడన్న సత్యమనే సువార్తను అర్థం చేసుకోవడం ప్రత్యేకించి ప్రాముఖ్యమైన అశం. దేవుడు పరిపూర్ణుడూ, లోపరహితుడు అనేది దానికి సంబంధించిన మరొక వాస్తవం. జీవితంలో నిష్కపటంగానూ, నిన్దారహితంగానూ క్రైస్తవులు ప్రవర్తించాలనేదే మూడవ వాస్తవం, ఇటువంటి సందర్భాలలో యుఎల్.టి తర్జుమా “పరిశుద్ధత,” “పరిశుద్దుడైన దేవుడు,” “పరిశుద్ధులు,” లేక “పరిశుద్ధ ప్రజలు” అని ఉపయోగిస్తుంది. *కొన్నిమార్లు దాని అర్థం ఒక నిర్దిష్టమైన బాధ్యతను అన్వయించకుండ క్రైస్తవులను గురించిన ఒక వివరణను మాత్రం సూచిస్తుంది. సందర్భాలలో యుఎల్.టి “విశ్వాసి” లేక “విశ్వాసులు” అని ఉపయోగిస్తుంది. (చూడండి: 6:10; 13:24)
  • కొన్నిమార్లు ఈ అర్థం దేవునికి మాత్రమే ప్రత్యేకించబడిన వస్తువునుగాని లేక ఒక వ్యక్తినిగాని సూచిస్తుంది. ఇటువంటి సందర్భాలలో యుఎల్.టి తర్జుమా “పవిత్రీకరణ,” “ప్రత్యేకించబడుట,” “ప్రతిష్టించబడుట,” లేక “ప్రత్యేకించుట” అని ఉపయోగించింది. (చూడండి: 2:11:9:13; 10:10,14, 29; 13:12)

అనువాదకులు తమ స్వంత అనువాదములలో ఈ తలంపులను వ్యక్తీకరించడానికి తలంచడంలో యుఎస్.టి అనేకమార్లు సహాయకరంగా ఉంటుంది.

హెబ్రీయులకు పత్రికలో ప్రధానమైన అంశాలు ఏమిటి?

ఈ క్రింది వచనాలకు ఆధునిక బైబిలు అనువాదాలాకూ, పాత అనువాదాలకూ వ్యత్యాసముంటుంది. యుఎల్.టి వాక్యభాగాలు ఆధునిక తర్జుమా కలిగియుంటుంది, పాత అనువాదాన్ని పేజీ కింది భాగంలో ప్రస్తావిస్తుంది. సాధారణ ప్రాంత భాషలో బైబిలు తర్జుమా ఉన్నట్లయితే, తర్జుమాదారులు ఆ అనువాదములలోని భాగాలను వినియోగించడానికి పరిశీలించాలి. లేనట్లయితే అనువాదకులు ఆధునిక తర్జుమాను వినియోగించాలని సూచన చేస్తున్నాము.

  • “నీవు అతనికి మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేసియున్నావు” (2:7). పాత అనువాదములలో “నీవు అతనికి మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేశావు మరియు నీ చేతి హస్తకృత్యములపైన నీవు అతనిని ఉంచియున్నావు” అని చదువుతాము,
  • “విధేయత చూపినవారితో విశ్వాసములో ఏకీభవించనివారు” (4:2). కొన్ని పాత అనువాదములలో, “విశ్వాసములో చేర్చబడకుండ దీనిని వినినవారందరూ” అని చదువుతాము.
  • “రాబోవు సత్కార్యములను చేయు విషయమై ప్రధాన యాజకుడిగా క్రీస్తు వచ్చాడు” (9:11). కొన్ని ఆధునిక తర్జుమాలలోనూ, పాత తర్జుమాలలోనూ “రాబోవు సత్కార్యములను చేయుటకు ప్రధాన యాజకుడిగా క్రీస్తు వచ్చెను” అని చదువుతాము.
  • “ఖైదీలుగా ఉన్నవారి మీద” (10:34). కొన్ని పాత తర్జుమాలలో “నా బంధకములలో నన్ను” అని చదువుతాము
  • “వారు రాళ్ళతో కొట్టబడిరి. వారు రెండు భాగములుగా రంపాలతో కోయబడిరి” (11:37). కొన్ని పాత తర్జుమాలలో “వారు రాళ్ళతో కొట్టబడిరి. వారు రంపాలతో రెండు భాగాలుగా కోయబడిరి. వారు శోధించబడిరి. వారు ఖడ్గములతో చంపబడిరి” అని చదువుతాము
  • “ఆ పర్వతమును జంతువు తాకినా కూడా, దానిని రాళ్ళతో కొట్టి చంపాలి” (12:20). కొన్ని పాత తర్జుమాలలో “ఆ పర్వతమును జంతువు తాకినా, దానిని తప్పకుండ రాళ్ళతో కొట్టి చంపాలి లేక బాణము వేయుట ద్వారా చంపాలి” అని చదువుతాము.

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)