te_tn_old/heb/13/intro.md

2.4 KiB

హేబ్రీయులకు వ్రాసిన పత్రిక 13సాధారణ వివరణలు

నిర్మాణం, క్రమపరచడం

12వ అధ్యాయములో ప్రారంభించిన హెచ్చరికలను గ్రంథకర్త ముగిస్తున్నాడు. తరువాత విశ్వాసులు తన కొరకు ప్రార్థించాలని కోరుతూ, తన పత్రికను ముగిస్తున్నాడు.

@)

కొన్నిఅనువాదాలు వాక్యభాగంలోని మిగిలిన భాగాన్ని సులువుగా చదవడానికి పద్యభాగంలో ప్రతీ వరుసను కుడిభాగంలో అమర్చారు. 13:6 వచనములలోనున్న పద్యభాగమును యుఎల్.టి అమర్చింది. ఇవి పాత నిబంధన వాక్యభాగాములోనుండితీసుకోబడ్డాయి.

ఈ అధ్యాయములోని ప్రత్యేకమైన అంశాలు

ఆతిథ్యం

తన ప్రజలు ఇతరులను తమ గృహాలలోనికి భోజనం చెయ్యడానికీ, విశ్రాంతి తీసుకోడానికీ ఆహ్వానించాలని దేవుడు కోరుతున్నాడు. తాము ఆహ్వానించుచున్న వ్యక్తులను గురించి తెలుసుకోకపోయినా తన ప్రజలు దీనిని చేయవలసియున్నది. పాత నిబంధన గ్రంథములో అబ్రహాము, అతని మేనల్లుడైనలోతు తమకు తెలియనివారికి ఆతిథ్యం చేసారు. అబ్రహాము వారికొరకు వెలగలిగిన ఆహారపదార్థాలను వడ్డించాడు, తరువాత లోతు వారిని తన ఇంటిలో పండుకొనుటకు ఆహ్వానించాడు. తర్వాత వారు దేవదూతలని వారు గుర్తెరిగారు.