te_tn_old/heb/09/intro.md

3.8 KiB

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 09 సాధారణ వివరణలు

నిర్మాణం, క్రమప్రచడం

దేవాలయం, దాని నియమాలన్నిటికంటే యేసు శ్రేష్టుడు అని ఈ అధ్యాయము చెప్పుచున్నది. పాత నిబంధన గ్రంథములోని మొదటి ఐదు అధ్యాయాలను తర్జుమా చేయకుండిన యెడల ఈ అధ్యాయమును అర్థము చేసుకోవడం కష్టతరంగా ఉంటుంది.

ఈ అధ్యాయంలో ప్రత్యేకమైన అంశాలు

వీలునామా

ఒకరు చనిపోయిన తరువాత తన ఆస్తి ఏమవ్వాలని వివరించి రాసియుంచిన చట్టబద్దమైన పత్రికను వీలునామా అంటారు.

రక్తము

పాత నిబంధనలో, ఇశ్రాయేలియులు తమ పాపాలనుండి విడుదల పొందడానికి బలులు అర్పించాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. వారు ఈ బలులు అర్పించడానికి ముందు వారు జంతువులను చంపి వాటి శరీరాన్ని మాత్రమే కాక వాటి రక్తాన్ని కూడా అర్పించాలి. రక్తం చిందించడం పదం ఒక జంతువునూ లేక మనుష్యుని చంపడానికి అన్యాపదేశంగా ఉంది. మనుష్యులు తనను చంపడానికి ఆయన అనుమతించినప్పుడు ప్రభువైన యేసు తన ప్రాణాన్నీ, తన రక్తాన్ని తన్నుతాను అర్పించుకొన్నాడు, గ్రంథ రచయిత ఈ అధ్యాయంలో చెప్పబడిన బలి శ్రేష్ఠమైనదని చెప్పుచున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///tw/dict/bible/kt/covenant]])

క్రీస్తు రాకడ

దేవుడు తన ప్రజల పాపములను క్షమించులాగున యేసు చనిపోయినప్పుడు ప్రారంభించిన కార్యాన్ని పూర్తిచేయడానికి ఆయన తిరిగి వస్తాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్న ప్రజలను రక్షించడాన్ని ఆయన ముగిస్తాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/save)

ఈ అధ్యాయములో ఇతర అనువాద సమస్యలు

మొదటి నిబంధన

దేవుడు మోషేతో చేసిన నిబంధనను ఇది సూచిస్తుంది. అయితే, ఆయన ఈ నిబంధనను చేయకముందే, దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసాడు. అయితే ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన మొదటి నిబంధన. “మొదటి నిబంధన” అనే మాటను “ప్రారంభ నిబంధన” అని తర్జుమా చేయుటకు మీరు నిర్ణయించవచ్చు.”