te_tn_old/heb/07/intro.md

1.7 KiB

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 07సాధారణ వివరణలు

నిర్మాణం, క్రమపరచడం

కొన్నిఅనువాదాలు వాక్యభాగంలోని మిగిలిన భాగాన్ని సులువుగా చదవడానికి పద్యభాగంలో ప్రతీ వరుసను కుడిభాగంలో అమర్చారు. 7:17,21 వచనములలోనున్న పద్యభాగమును యుఎల్.టి అమర్చింది. ఈ వచనములు పాత నిబంధనలోనుండి తీసుకోబడ్డాయి.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

ప్రధాన యాజకుడు

దేవుడు పాపాలు క్షమించేలా ప్రధానయాజకుడు మాత్రమే బలులు అర్పించాలి. ఆ కారణంగా ప్రభువైన యేసు ప్రధాన యాజకుడు కావలసి వచ్చింది. ప్రధాన యాజకుడు లేవీ గోత్రం వాడుగా ఉండాలని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది అయితే యేసు యూదా గోత్రం నుండి వచ్చాడు. దేవుడు ఆయనను మెల్కీసెదెకు యాజకునిగా చేసాడు, అతడు అబ్రహాము కాలంలో, లేవీ గోత్రానికి ముందే జీవించాడు.