te_tn_old/heb/05/intro.md

2.9 KiB

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 05 సాధారణ వివరణలు

నిర్మాణం, క్రమపరచడం

ముందున్న అధ్యాయములోని బోధ కొనసాగింపు ఈ అధ్యాయంలో ఉంది.

కొన్నిఅనువాదాలు వాక్యభాగంలోని మిగిలిన భాగాన్ని సులువుగా చదవడానికి పద్యభాగంలో ప్రతీ వరుసను కుడిభాగంలో అమర్చారు. 5:5-6 వచనములలోనున్న పద్యభాగమును యుఎల్.టి అమర్చింది.

ఈ అధ్యాయంలో ప్రత్యేక అంశాలు.

ప్రధాన యాజకుడు

దేవుడు పాపాలను క్షమించునట్లు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే బలులు అర్పించగల్గుతాడు. ఆ కారణంగా ప్రభువైన యేసు ప్రధాన యాజకుడు కావలసి వచ్చింది. ప్రధాన యాజకుడు లేవి గోత్రం నుండి వస్తాడని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించింది. అయితే యేసు యూదా గోత్రమునుండి వచ్చాడు. లేవి గోత్రానికి ముందే అబ్రాహాము కాలములో నివసించిన మెల్కీసెదెకు యాజకునివలే దేవుడు ఆయనను యాజకునిగా చేసాడు.

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన భాషారూపాలు

పాలు, ఘనాహారం

వారు పసిబాలురుగా కేవలం పాలను తీసుకొంటూ, ఘనాహారాన్ని తీసుకొనలేకుండా ఉన్నట్టు యేసును గూర్చిన స్వల్పమైన అంశాలను అర్థం చేసుకొనే క్రైస్తవులనుగురించి గ్రంథకర్త మాట్లాడుచున్నాడు. వారు పసిపిల్లలుగా ఉండి, కేవలము పాలను మాత్రమె త్రాగుచున్నారేగాని, బలమైన ఆహారము తిరువారు కారు అని గ్రంథకర్త వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)