te_tn_old/heb/04/intro.md

1.9 KiB

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 04 సాధారణ వివరణ

నిర్మాణం, క్రమపరచడం

యేసు గొప్ప ప్రధాన యాజకుడని ఈ అధ్యాయం చెపుతుంది.

కొన్నిఅనువాదాలు వాక్యభాగంలోని మిగిలిన భాగాన్ని సులువుగా చదవడానికి పద్యభాగంలో ప్రతీ వరుసను కుడిభాగంలో అమర్చారు. 4:3-4, 7 వచనాలలో పద్యభాగమును యుఎల్.టి అమర్చింది. ఈ వచనములు పాత నిబంధనలోనుండి తీయబడినవి.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

దేవుని విశ్రాంతి

”విశ్రాంతి” అనే పదం ఈ అధ్యాయములో కనీసం రెండు విషయాలను సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. దేవుని ప్రజలు తమ పనినుండి విరమించుకొని విశ్రాంతి తీసుకొనుటకు ఆయన వారికి అనుమతినిచ్చినప్పుడు ఈ పదం ఆ స్థలాన్ని లేక సమయాన్ని సూచించుచున్నది ([హెబ్రీ.4:3] (../../హెబ్రీ/04/03.ఎం.డి)), ఈ పదము దేవుడు ఏడవ దినమున విశ్రాంతి తీసుకోవడాన్ని సూచిస్తుంది. ([హెబ్రీ.4:4] (../../హెబ్రీ/04/04.ఎం.డి)).