te_tn_old/heb/01/intro.md

2.6 KiB

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 01 సాధారణ వివరణ

నిర్మాణం, క్రమము

దూతలకంటే యేసు మనకు అధికంగా ప్రాముఖ్యమైనవాడని ఈ అధ్యాయము వివరిస్తుంది.

కొన్ని తర్జుమాలు చదవడానికి సులభంగా ఉండడానికి పద్యభాగములోని ప్రతి పంక్తిని మిగిలి వచనం కుడిప్రక్కన అమర్చుచున్నారు. పాతనిబంధనలోనుండి తీయబడిన కొన్ని పదాలను, 1:5, 7-13 వచనములలోనున్న పద్యభాగముతో యుఎల్.టి తర్జుమా చేసింది.

“మన పితరులు”

యూదులుగా పెరిగన క్రైస్తవులకు గ్రంథకర్త ఈ పత్రికను రాస్తున్నాడు. ఇందుచేతనే ఈ పత్రిక “హెబ్రీయులకు పత్రిక” అని పిలువబడింది.

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన భాషారూపాలు

అలంకారిక ప్రశ్నలు

యేసు దూతలకంటే గొప్పవాడని రుజువు పరచడానికి గ్రంథకర్త అలంకారిక ప్రశ్నలను వినియోగిస్తున్నాడు. గ్రంథకర్తకూ, పాఠకులకూ ఈ ప్రశ్నల జవాబులు తెలుసు. పాఠకులు ఈ ప్రశ్నలకు జవాబులను గురించి ఆలోచిస్తుండగా దేవుని కుమారుడు దూతలందరికంటే చాలా ప్రాముఖ్యమైనవాడని వారు తెలుసుకొంటారు.

పద్యం

యూదా ఉపదేషకులు పాత నిబంధన ప్రవక్తలవలే తమ ప్రాముఖ్యమైన బోధలలో ఎక్కువ శాతం పద్యభాగ రూపములోనే ఉంచారు. తద్వారా పాఠకులు వాటిని నేర్చుకోగల్గుతారు, వాటిని జ్ఞాపకం ఉంచుకొంటారు.