te_tn_old/heb/01/03.md

4.1 KiB

the brightness of God's glory

ఆయన మహిమ వెలుగు. దేవుని మహిమ అతి ప్రకాశమానమైన వెలుగుతో సంబంధపరచబడియుంది. దేవుని మహిమనూ, తేజస్సునూ సంపూర్తిగా కుమారుడు చూపిస్తున్నాడని గ్రంథకర్త తెలియపరచుచున్నాడు.

glory, the exact representation of his being

మహిమ, దేవుని మూర్తిమత్త్వం స్వరూపం. “దేవుని స్వభావ స్వరూపం” అనే వాక్యం “దేవుని మహిమా తేజస్సు” వాక్యానికి సమాన అర్థాన్ని కలిగియుంది. దేవుని స్వభావాన్నీ, ఆయన తత్త్వాన్నీ కుమారుడు మూర్తీభవిస్తున్నాడు. దేవుని సమస్తాన్నీ కుమారుడు సంపూర్తిగా కనుపరుస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మహిమ, దేవునిలా ఉంది” లేక “మహిమ, దేవుని గూర్చి సత్యమైనది కుమారుని గూర్చియూ సత్యమే”

the word of his power

ఆయన శక్తివంతమైన వాక్యం. ఇక్కడ “వాక్కు” అనే పదం ఒక సందేశాన్నీ, లేక ఆజ్ఞను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన శక్తివంతమైన ఆజ్ఞ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

After he had made cleansing for sins

“శుద్ధిచేయడం” అనే భావనామం ఒక క్రియాపదంగా వ్యక్తీకరించబడవచ్చు, “శుభ్రం చెయ్యడం.” ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపములనుండి మనలను శుద్ధి చేసి ముగించిన తరువాత” లేక “మన పాపములనుండి మనలను పవిత్రీకరించిన తరువాత” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

he had made cleansing for sins

ఒక వ్యక్తిని శుద్ధి చెయ్యడం అన్నట్లుగా పాపములను క్షమించడం గురించి రచయిత మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మన పాపములను క్షమించడంకోసం ఆయన దానిని సాధ్యపరచాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he sat down at the right hand of the Majesty on high

“దేవుని కుడి ప్రక్కన” కూర్చోవడం దేవునినుండి అధికారాన్నీ, ఘనతనూ పొందాడనే దానికి గుర్తుగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన సర్వోన్నత స్థలంలో మహోన్నతుని ఘనతా, అధికారం ఉన్న స్థలంలో కూర్చొనియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

the Majesty on high

ఇక్కడ “ప్రభావము” అనే పదం దేవుణ్ణి సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సర్వోన్నతుడైన దేవుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)