te_tn_old/gal/front/intro.md

15 KiB

గలతీయులకు వ్రాసిన పత్రికకు పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

గలతీయులకు వ్రాసిన పత్రిక యొక్క విభజన

  1. పౌలు తాను యేసు క్రీస్తు శిష్యుడునని తనకున్న అధికారమును వెల్లడి చేసికొనుట; గలతీలోని క్రైస్తవులు ఇతర ప్రజలనుండి తప్పుడు బోధలను అంగీకరించుట విషయములో తాను ఆశ్చర్యము వ్యక్తము చేసినట్లుగా పౌలు చెప్పుచున్నాడు (1:1-10).
  2. ప్రజలు క్రీస్తునందు విశ్వసించుట ద్వారా మాత్రమే రక్షించబడుదురుగాని, ధర్మశాస్త్రమును నెరవేర్చుట ద్వారా రక్షించబడరని పౌలు చెప్పుచున్నాడు (1:11-2:21).
  3. ప్రజలు క్రీస్తునందు విశ్వసిస్తేనే దేవుడు వారిని తనతో ఉండుటకు అవకాశమిస్తాడు; ఉదాహరణకు అబ్రాహామును తీసుకోండి; ధర్మశాస్త్రము తీసుకొనివచ్చే శాపము (రక్షణ కొరకు కాదు); బానిసత్వము మరియు స్వాతంత్ర్యము పోల్చబడియున్నది, అంతేగాకుండా ఇది హాగరు మరియు శారాలకు పోల్చి చెప్పబడింది (3:1-4:31).
  4. ప్రజలు క్రీస్తులో చేరినప్పుడు, వారు మోషే ధర్మశాస్త్రమును అనుసరించుటనుండి విడిపించబడి స్వతంత్రులవుతారు. అంతేగాకుండా, పరిశుద్ధాత్ముడు వారిని నడపించే కొలది నడుచుటకు వారు స్వతంత్రులగుదురు. వారు పాపపు ఆశలను ఎదురించుటకు స్వతంత్రులగుదురు. ఒకరినొకరి భారములను మోయుటకు స్వతంత్రులగుదురు (5:1-6:10).
  5. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమును అనుసరించుటయందు మరియు సున్నతి పొందుటయందు నమ్మికయుంచవద్దని పౌలు క్రైస్తవులను హెచ్చరించుచున్నాడు. అలా చేయుటకు బదులుగా, వారు క్రీస్తునందు తప్పక నమ్మికయుంచాలని చెప్పుచున్నాడు (6:11-18).

గలతీయులకు వ్రాసిన పత్రికను ఎవరు వ్రాశారు?

తార్సు అనే పట్టణ వాసియైన పౌలు అనే వ్యక్తి ఈ పుస్తకము యొక్క రచయితయైయుండెను. పౌలు పేరు మొదటిగా సౌలు అని పిలువబడుచుండెను. అతను క్రైస్తవుడు కాకమునుపు, పౌలు ఒక పరిసయ్యుడైయుండెను. అతను క్రైస్తవులను హింసించియుండెను. అతను క్రీస్తునందు నమ్మికయుంచిన తరువాత, యేసును గూర్చిన వార్తను ప్రజలకు తెలియజెప్పుటకు రోమా సామ్రాజ్యమందంతట అనేకమార్లు ప్రయాణము చేసియుండెను.

పౌలు ఈ పత్రికను ఎప్పుడు వ్రాశాడని సరిగ్గా తెలియదు మరియు ఎక్కడనుండి ఈ పత్రికను వ్రాశాడన్న విషయము కూడా తెలియదు. కొంతమంది పండితులు పౌలు యేసు వార్తను ప్రజలకు చెప్పుటకు రెండవ మారు ప్రయాణము చేసిన తరువాత ఈ పత్రికను వ్రాసియుండవచ్చునని మరియు ఈ పత్రికను ఎఫెసు పట్టణమునుండి వ్రాసియుండవచ్చునని చెప్పుదురు. మరికొంతమంది పండితులు పౌలు సిరియాలోని అంతియొకయ పట్టణమునుండి వ్రాసియుండవచ్చునని మరియు మొట్ట మొదటిగా ఆయన ప్రయాణము చేసిన తరువాత వ్రాసియుండవచ్చునని చెప్పుదురు.

గలతీయులకు వ్రాసిన పత్రిక ఏ విషయానికి సంబంధించినదైయున్నది?

పౌలు ఈ పత్రికను గలతీ ప్రాంతములో నివాసముంటున్న యూదుల క్రైస్తవులకు మరియు యూదేతర క్రైస్తవులకు వ్రాసియుండెను. క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రమును అనుసరించవలసియున్నదని చెప్పిన తప్పుడు బోధకులకు విరుద్ధముగా ఆయన ఈ పత్రికను వ్రాసియుండెను. ఒక వ్యక్తి యేసునందు నమ్మికయుంచుట ద్వారానే రక్షించబడునని వివరించుట ద్వారా సువార్త సత్యమును పౌలు బలపరిచియుండెను. దేవుడు కృప చూపినందునే ప్రజలు రక్షించబడియున్నారు గాని ప్రజలు చేసిన మంచి క్రియలను బట్టి కాదు. ఏ వ్యక్తి కూడా పరిపూర్ణముగా ధర్మశాస్త్రమునకు లోబడియుండలేడు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రముకు విధేయత చూపుట ద్వారా దేవునిని మెప్పించాలనే ప్రయత్నము దేవుడు వారిని శిక్షించుటకే గురి చేయును. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/goodnews]], [[rc:///tw/dict/bible/kt/save]], [[rc:///tw/dict/bible/kt/faith]] మరియు [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] మరియు rc://*/tw/dict/bible/kt/works)

ఈ పుస్తకము యొక్క పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమాదారులు ఈ పుస్తకమును “గలతీయులకు” అని దాని సంప్రదాయ పేరుతో పెలుచుటకు ఎన్నుకొనవచ్చును. లేదా వారు “గలతీలోని సంఘమునకు పౌలు వ్రాసిన పత్రిక” అనే స్పష్టమైన పేరును కూడా ఎన్నుకోవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: ప్రాముఖ్య భక్తిపరమైన మరియు సాంస్కృతికపరమైన అంశాలు

“యూదులవలె జీవించుట” అనగా అర్థము ఏమిటి (2:14)?

”యూదులవలె జీవించుట” అనగా యేసులో విశ్వాసము ఉంచినప్పటికి మోషే ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట అని అర్థము. ఆదిమ క్రైస్తవులలో ప్రజలలో కొందరు “యూదా మతస్తులు (లేక, జూడాయిజర్స్)” అని పిలువబడుట అవశ్యము అని చెప్పుచుండిరి.

భాగము 3: తర్జుమాపరమైన ప్రాముఖ్య కీలక విషయాలు

పౌలు ఈ గలతీయులకు వ్రాసిన పత్రికలో “ధర్మశాస్త్రము” మరియు “కృప” అనే పదాలను ఎలా ఉపయోగించాడు?

గలతీయులకు వ్రాసిన పత్రికలో ఈ పదాలను చాలా విశేషముగా ఉపయోగించబడియున్నాయి. క్రైస్తవ జీవన విధానమును గూర్చి గలతీయులలో ప్రాముఖ్యమైన బోధ ఉన్నది. మోషే ధర్మశాస్త్రము క్రింద నీతిగా లేక పరిశుద్ధమైన జీవితమును జీవించాలంటే ఆ వ్యక్తి నియమ నిబంధనలను పాటించవలసియుంటుంది. క్రైస్తవులుగా పరిశుద్ధ జీవితము అనేది ఇప్పుడు కృప ద్వారా ప్రోత్సహించబడుచున్నది. క్రైస్తవులు క్రీస్తునందు స్వాతంత్ర్యమును కలిగియున్నారు మరియు నియమ నిబంధనలను పాటించనవసరములేదని దీని అర్థము. దీనికి బదులుగా, క్రైస్తవులు పరిశుద్ధమైన జీవితమును జీవించాలి ఎందుకంటే దేవుడు ప్రజలపట్ల దయగలిగియున్నందున వారు కృతజ్ఞతకలిగియుండాలి. దీనినే “క్రీస్తు నియమము (క్రీస్తు ధర్మశాస్త్రము)” అని పిలిచెదరు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/righteous]] మరియు [[rc:///tw/dict/bible/kt/holy]])

పౌలు ఉపయోగించిన “క్రీస్తునందు,” “ప్రభువునందు,” ఇంకా మొదలగు మాటలకు అర్థము ఏమిటి?

ఇటువంటి మాటలన్నియు 1:22; 2:4,17; 3:14,26,28; 5:6,10 వచనములలో కలిపిస్తాయి. క్రీస్తుతోనూ మరియు విశ్వాసులతోనూ ఏకమైయున్నారనే ఆలోచనను వ్యక్తము చేయుటయే పౌలు ఉద్దేశమునైయున్నది. ఆ సందర్భములోనే అతను ఇతర అర్థాలను కూడా వ్యక్తపరచాలని ఉద్దేశించియుండెను. చూడండి, ఉదాహరణకు, “క్రీస్తునందు మనలను నీతిమంతులుగా చేయాలని మనము దేవునికొరకు ఎదురుచూచినప్పుడు” (2:17), క్రీస్తునుబట్టి నీతిమంతులుగా తీర్చబడాలని పౌలు మాట్లాడుచున్నాడు.

ఈ విధమైన మాటను గూర్చిన మరింత సమాచారమునుగూర్చి మరిన్ని వివరాలకొరకు రోమా పత్రిక యొక్క పరిచయమును దయచేసి చూడండి.

ఈ గలతీయులకు వ్రాసిన పత్రికలోని వాక్యభాగములలో ముఖ్యమైన కీలక విషయాలు ఏవి?

  • “తెలివిలేని గలతీయులారా, మిమ్మును భ్రమపెట్టిందెవరు? మీ కన్నుల ముందే సిలువకు వేయబడినట్లుగా యేసు క్రీస్తు ప్రదర్శించబడలేదా” (3:1)? యుఎల్టి, యుఎస్టి మరియు ఇతర ఆధునిక తర్జుమాలు ఈ వాక్యమునే కలిగియుంటాయి. అయితే, పరిశుద్ధ గ్రంథము యొక్క పాత తర్జుమాలలో “[కాబట్టి] మీరు సత్యానికి విధేయులు కాలేదని” చేర్చియుంటారు. ఈ మాటను చేర్చవద్దని తర్జుమాదారులకు సలహా ఇవ్వడమైనది. ఏదేమైనా, తర్జుమాదారుల ప్రాంతములలో ఈ వాక్యభాగమును పాత తర్జుమాలు కలిగియున్నట్లయితే, తర్జుమాదారులు దానిని చేర్చవచ్చును. తర్జుమా చేసినట్లయితే, ఇది బహుశః గలతీయులకు కాదన్నట్లుగా సూచించుటకు దానిని ([]) బ్రాకెట్లలో పెట్టండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)