te_tn_old/gal/06/intro.md

2.7 KiB

గలతీయులకు వ్రాసిన పత్రిక 06 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

ఈ అధ్యాయముతో పౌలు పత్రిక ముగుస్తుంది. అతను చివరిలో చెప్పిన కొన్ని సంగతులు పత్రికలోనున్న విషయాలతో ఎటువంటి సంబంధము కలిగియుండవన్నట్లుగా కనబడుతుంది.

సహోదరులు

పౌలు క్రైస్తవులకొరకే ఈ అధ్యాయములో వ్రాసియున్నాడు. ఆయన వారిని “సహోదరులు” అని పిలచుచున్నాడు. ఇది పౌలు యొక్క క్రైస్తవ సహోదరులనే సూచించుచున్నదిగాని, తన యూదా సహోదరులను సూచించుటలేదు.

ఈ అధ్యాయములో విశేషమైన అంశాలు

నూతన సృష్టి

తిరిగి జన్మించిన ప్రజలందరూ క్రీస్తునందు నూతన సృష్టియైయున్నారు. క్రైస్తవులు క్రీస్తునందు నూతన సృష్టియైయున్నారు. వారు క్రీస్తునందలి విశ్వాసములోనికి వచ్చిన తరువాత వారిలో వారు నూతన స్వభావమును కలిగియున్నారు. పౌలుకు, ఒక వ్యక్తి యొక్క పూర్వోత్తరాలకంటెను ఇది చాలా ప్రాముఖ్యమైనది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/bornagain]] మరియు [[rc:///tw/dict/bible/kt/faith]])

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట సందర్భాలు

శరీరము

ఇది క్లిష్టమైన విషయము. “శరీరము” అనే పదము “ఆత్మ” అనే పదముకు విరుద్ధమైనది. ఈ అధ్యాయములో శరీరము అనే పదము భౌతిక దేహమును సూచించుటకు కూడా వాడబడియున్నది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/flesh]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు rc://*/tw/dict/bible/kt/spirit)