te_tn_old/gal/05/intro.md

3.1 KiB

గలతీయులకు వ్రాసిన పత్రిక 05 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని పడగొట్టును లేక బానిసగా చేయును అన్నట్లుగా పౌలు ధర్మశాస్త్రమును గూర్చి వ్రాయుచున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

ఆత్మ ఫలము

”ఆత్మ ఫలము” అనే మాటలో అనేక విషయములు పొందుపరచబడినప్పటికి, ఇది బహువచనము కాదు. సాధ్యమైతే ఈ పదమును ఏకవచనముగానే ఉంచాలని తర్జుమాదారులకు మనవి చేయడమైనది. (చూడండి: rc://*/tw/dict/bible/other/fruit)

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన రూపకఅలంకారములు

ఉదాహరణలు

క్లిష్ట సంగతులను వివరించేందుకు మరియు పౌలు తన అంశాలను చక్కగా ఉదహరించి బోధించేందుకు ఈ అధ్యాయములో అనేకమైన రూపకఅలంకారములను ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట సందర్భాలు

“మీరు క్రీస్తునుండి వేరుచేయబడియున్నారు, మీరు ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడితే, మీరు ఎప్పటికిని కృపను అనుభవించలేరు.”

సున్నతి చేసుకోవడము ద్వారా తమ రక్షణ కోల్పోవలసిన అవసరము ఉంటుందనే విషయమును పౌలు భోధించుచున్నాడని కొంతమంది పండితులు యోచించుచున్నారు. దేవుని ఎదుట నీతిమంతులుగా పరిగణించబడుటకు ధర్మశాస్త్రముకు లోబడియుండుట అనేది కృప ద్వారా రక్షించబడుటనుండి ఒక వ్యక్తిని దూరముగా ఉంచుననే ఉద్దేశము పౌలుదైయుండవచ్చునని ఇతర పండితులు ఆలోచించుచున్నారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/grace)