te_tn_old/gal/03/intro.md

4.0 KiB

గలతీయులకు వ్రాసిన పత్రిక 03 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

క్రీస్తునందు సమానత్వం

క్రైస్తవులందరూ క్రీస్తుతో సమానముగా ఐక్యపరచబడియున్నారు. వంశపారంపర్యము, లింగము, మరియు స్థాయి అనేవి ముఖ్యము కాదు. అందరితో అందరు సమానులే. దేవుని దృష్టిలో అందరూ సమానులే.

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారములు

అలంకారిక ప్రశ్నలు

పౌలు ఈ అధ్యాయములో అనేకమైన అలంకారిక ప్రశ్నలను సంధించియున్నాడు. గలతీయులు తమ పాపము తెలుసుకొనునట్లు అతను వాటిని ఉపయోగించియున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]])

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట సందర్భాలు

శరీరము

ఇది చాలా క్లిష్టమైన విషయము. “శరీరము” అనే పదము మన పాపసంబంధమైన స్వభావమునకు రూపకఅలంకారముగా ఉన్నది. మనిషిలోనున్న భౌతిక సంబంధమైన భాగము పాపాత్మకమైనదని పౌలు బోధించుటలేదు. ఈ అధ్యాయములో ఉపయోగించబడిన “శరీరము” అనే పదము ఆత్మీయతకు విరుద్ధముగా ఉపయోగించబడియున్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/flesh)

“విశ్వసించిన వారందరూ అబ్రాహాము పిల్లలు”

ఈ మాటకు అర్థము ఏమిటని చెప్పుటకు పండితులు విడిపోయారు. దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్ధానములన్నియు క్రైస్తవులు స్వాధీనము చేసుకొందురని, అందుచేత భౌతికసంబంధమైన ఇశ్రాయేలీయుల స్థానములో క్రైస్తవులు ఉంటారని కొంతమంది నమ్ముదురు. క్రైస్తవులు ఆత్మీయకముగా అబ్రాహామును అనుసరిస్తారేగాని వారు దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్ధానములను స్వతంత్రించుకొనరని మరికొంతమంది నమ్ముతారు. పౌలు చేసిన ఇతర బోధనల వెలుగులో మరియు ఇక్కడ సందర్భములో చూచినట్లయితే, అబ్రాహాము ఏ విశ్వాసమునైతే కలిగియున్నాడో అదే విశ్వాసమును యూదులైన క్రైస్తవులు మరియు అన్యులైన క్రైస్తవులు కలిగియున్నారనేదానిని గూర్చి పౌలు వ్రాస్తూ ఉండవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/spirit]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])