te_tn_old/gal/02/intro.md

3.1 KiB

గలతీయులకు వ్రాసిన పత్రిక 02 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

సత్య సువార్తను పరిరక్షించుటలో పౌలు ముందుకు కొనసాగుచున్నాడు. ఇది [గలతీ.1:11] (../../గలతీ/01/11.ఎం.డి) వచనములో ఆరంభించబడియున్నది.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

స్వాతంత్ర్యం మరియు బానిసత్వము

ఈ పత్రికయంతటిలో పౌలు స్వాతంత్ర్యమును మరియు బానిసత్వమును వివరించుచున్నాడు. క్రైస్తవుడు అనేకమైన విభిన్నమైన కార్యములు చేయుటకు క్రీస్తునందు స్వతంత్రులైయున్నారు. అయితే మోషే ధర్మశాస్త్రమును అనుసరించుటకు ప్రయత్నించే క్రైస్తవుడు ధర్మశాస్త్రమునంతటిని అనుసరించవలసియుండును. ధర్మశాస్త్రమును పాటించుటకు ప్రయత్నము చేయుటయనునది బానిసత్వములాంటిదని పౌలు వివరించుచున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన క్లిష్ట సందర్భాలు

“నేను దేవుని కృపను ఎదిరించలేను”

క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రమును అనుసరించుటకు ప్రయత్నించినట్లయితే, దేవుడు వారికి చూపించిన కృపను వారు అర్థము చేసికొనలేదని పౌలు బోధించుచున్నాడు. ఇదే ప్రారంభ తప్పిదము. అయితే ఒక రకమైన ఊహాత్మక పరిస్థితిగా “నేను దేవుని కృపను ఎదిరించలేను” అనే మాటలను పౌలు ఉపయోగించుచున్నాడు. “మీరు ధర్మశాస్త్రమును అనుసరించుట ద్వారా రక్షించబడినట్లయితే, ఈ విధమైన చర్య దేవుని కృపను ఎదిరించుచున్నది” అనే మాటలో పౌలు మాటల ఉద్దేశమును కనిపించవచ్చును. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/grace]] మరియు [[rc:///ta/man/translate/figs-hypo]])