te_tn_old/eph/front/intro.md

18 KiB

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక యొక్క పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

ఎఫెసీయులకు వ్రాసిన పత్రికయొక్క విభజన

  1. క్రీస్తునందు ఆశీర్వాదములకొరకైన ప్రార్థన మరియు శుభములు (1:1-23)
  2. పాపము మరియు రక్షణ (2:1-10)
  3. ఐక్యత మరియు సమాధానము (2:11-22)
  4. మీయందున్న క్రీస్తు రహస్యము, తెలుసుకొనునట్లు చేసెను (3:1-13)
  5. వారిని బలపరచుటకు ఆయన మహిమ ఐశ్యర్యము కొరకు ప్రార్థన (3:14-21)
  6. ఆత్మ ఐక్యత, క్రీస్తు దేహమును నిర్మించుట (4:1-16)
  7. క్రొత్త జీవితము (4:17-32)
  8. దేవునిని అనుసరించువారు (5:1-21)
  9. భార్యలు మరియు భర్తలు; పిల్లలు మరియు తల్లిదండ్రులు; దాసులు మరియు యజమానులు (5:22-6:9)
  10. దేవుని సర్వాంగ కవచము (6:10-20)
  11. చివరి శుభవచనములు (6:21-24)

ఎఫెసీయులకు వ్రాసిన పత్రికను ఎవరు వ్రాశారు?

ఎఫెసీయులకు వ్రాసిన ఈ పత్రికను పౌలు వ్రాసెను. పౌలు తార్సు పట్టణమునకు చెందినవాడు. పౌలు తన ప్రారంభ జీవితములో సౌలుగా పిలువబడియున్నాడు. క్రైస్తవుడు కాకమునుపు, పౌలు ఒక పరిసయ్యుడైయుండెను. అతను క్రైస్తవులను హింసించియుండెను. అతను క్రైస్తవుడైన తరువాత, అతను యేసును గూర్చి ప్రజలకు బోధించుటకు రోమా సామ్రాజ్యమందంతట అనేకమార్లు ప్రయాణము చేసియుండెను.

అపొస్తలుడైన పౌలు చేసిన ఒక ప్రయాణములో ఎఫెసులో సంఘమును ఆరంభించుటకు సహాయము చేసియుండెను. అతను కూడా ఎఫెసులో సుమారు ఒకటిన్నర సంవత్సరము ఉండి, అక్కడున్న విశ్వాసులకు సహాయం చేసెను. పౌలు బహుశః ఈ పత్రికను ఆయన రోమాలోని చెరలో ఉన్నప్పుడు వ్రాసియుండవచ్చును.

ఎఫెసీయులకు వ్రాసిన పుస్తకము దేనికి సంబంధించియున్నది?

క్రీస్తుయేసునందున్నవారికొరకు దేవుని ప్రేమ ఎట్టిదని వివరించుటకు పౌలు ఎఫెసీలోని క్రైస్తవులకు ఈ పత్రికను వ్రాసియున్నాడు. వారు ఇప్పుడు క్రీస్తుతో ఏకమైయున్నందున దేవుడు వారికిచ్చుచున్న ఆశీర్వాదములను గూర్చి ఆయన వివరించుచున్నాడు. విశ్వాసులలో యూదులైన లేక అన్యులైన అందరు ఐక్యమైయున్నారనే విషయమును ఆయన వివరించుచున్నాడు. దేవునికి ఇష్టమైన విధానములోనే జీవించాలని వారిని ప్రోత్సహించుటకు పౌలు కోరుచున్నాడు.

ఈ పుస్తకముయొక్క పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమాదారులు ఈ పుస్తకమును “ఎఫెసీయులు” అనే సంప్రదాయ పేరుతొ పిలుచుటకు ఎన్నుకొనవచ్చును. లేదా వారు ఇంకా స్పష్టమైన పేరును ఎన్నుకోవచ్చును, ఎలాగనగా, “ఎఫెసీలోని సంఘముకు పౌలు యొక్క పత్రిక” లేక “ఎఫెసీలోని క్రైస్తవులకు పత్రిక” అని కూడా పిలువవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: ప్రాముఖ్య భక్తిపరమైన మరియు సంస్కృతిపరమైన అంశాలు

ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో “దాచబడిన సత్యము” ఏమైయుండెను?

ఈ మాట యుఎల్టి తర్జుమాలో “దాచబడిన సత్యము” లేక “దాచబడిన” అని సుమారు ఆరు సార్లు తర్జుమా చేయబడియున్నది. ఇలా ఈ పదాలను ఉపయోగించుట ద్వారా ఉద్దేశము ఏమనగా దేవుడు మనుష్యులకు కొన్ని సంగతులను బయలుపరచాలని కోరుకుంటున్నాడని అర్థము, ఎందుకంటే వారు తమంతట తాము ఆ విషయాలను తెలుసుకోవడం సాధ్యపడదు. దేవుడు మనుష్యులను రక్షించుటకు ఎటువంటి ప్రణాళికను వేసియున్నాడనే విషయమును గూర్చి ఈ మాటలు ఎల్లప్పుడు సూచిస్తాయి. కొన్నిమార్లు దేవునికి మరియు మానవులకు మధ్యన సమాధానము కలిగించుటకు తన ప్రణాళిక ఉద్దేశమైయుండును. మరికొన్నిమార్లు క్రీస్తు ద్వారా యూదులను మరియు అన్యులను ఏకపరచుటకు తన ప్రణాళికలో ఉద్దేశమైయుండును. యూదులతో సమానముగా ఇప్పుడు అన్యులు కూడా క్రీస్తు వాగ్ధానములనుండి ప్రయోజనములు పొందుదగినవారైరి.

పౌలు రక్షణను గూర్చి మరియు నీతిగా జీవించుటను గూర్చి ఏమి చెప్పియున్నాడు?

పౌలు ఈ పత్రికలోను మరియు తాను వ్రాసిన అనేక పత్రికలలోను రక్షణను గూర్చి మరియు తన పత్రికలను గూర్చి ఎక్కువగా వ్రాసియున్నాడు. దేవుడు దయగలవాడైయున్నాడని మరియు క్రైస్తవులను రక్షించియున్నాడని చెప్పియున్నాడు, ఎందుకంటే వారు క్రీస్తునందు నమ్మికయుంచియున్నారు. అందుచేత, వారు క్రైస్తవులైన తరువాత, వారు క్రీస్తునందు విశ్వాసముంచియున్నారని చూపించుటకు నీతి మార్గములో తప్పక జీవించవలసినవారైయున్నారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/righteous)

భాగము 3: తర్జుమాపరమైన ప్రాముఖ్య విషయాలు

ఏకవచనము మరియు బహువచనము “మీరు”

ఈ పుస్తకములో, “నేను” అనే పదము పౌలును సూచించుచున్నది. “మీరు” అనే పదము బహువచనముకు సంబంధించినది, ఇది ఈ పత్రికను చదువుచున్న విశ్వాసులను సూచించుచున్నది. ఈ విషయానికి సంబంధించి 5:14, 6:2, మరియు 6:3 వచనములను మినహాయించి చెప్పుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

“క్రొత్తది” లేక “నూతన పురుషుడు” అని చెప్పుటలో పౌలు ఉద్దేశము ఏమిటి?

“క్రొత్తది” లేక “నూతన పురుషుడు” అని పౌలు మాట్లాడినప్పుడు అతని ఉద్దేశము ఏమనగా పరిశుద్ధాత్మనుండి ఒక విశ్వాసి పొందుకునే క్రొత్త స్వభావము అని అర్థము. ఈ క్రొత్త స్వభావము దేవుని స్వరూపమందు సృష్టించబడియున్నది (చూడండి: 4:24). “నూతన పురుషుడు” అనే మాట యూదులకు మరియు అన్యులకు మధ్యన దేవుడు కలుగజేసే సమాధానము కొరకు కూడా ఉపయోగించబడియున్నది. దేవుడు తనకు సంబంధించిన ఒక ప్రజగా వారిని కలిపియున్నాడు (చూడండి: 2:15).

యుఎల్టి తర్జుమాలో “పరిశుద్ధత” మరియు “పవిత్రీకరణ” అనే మాటలను ఎఫెసీయులలో ఎలా వివరించబడియున్నవి?

ఇతర విభిన్న ఆలోచనలను సూచించుటకు లేఖనములలో అటువంటి పదాలు ఉపయోగించబడియున్నవి. ఈ కారణముచేత తర్జుమాదారులు తమ భాషలలో వాటిని చెప్పడము కొంచెము కష్టతరమవుచుండవచ్చును. ఆంగ్ల భాషలోనికి తర్జుమా చేయుటలో, యుఎల్టి ఈ క్రింది సూత్రాలను ఉపయోగించును:

*కొన్నిమార్లు వక్యభాగాములోని అర్థము నైతిక పరిశుద్ధతను తెలియజేయును. విశేషముగా సువార్తను అర్థము చేసికొనుట ప్రాముఖ్యము, క్రైస్తవులు యేసు క్రీస్తుతో ఏకమైయున్నందున దేవుడు వారిని పాపరహిత ప్రజలుగా చూచుచున్నడనే సత్యమును వ్యక్తము చేయుటకు “పరిశుద్ధత” అనే పదమును ఉపయోగించడమైనది. దేవుడు పరిపూర్ణుడు మరియు ఏ దోషములేనివాడనే ఆలోచనను వ్యక్తము చేయుటకు “పరిశుద్ధుడు” అనే పదము మరో విధముగా ఉపయోగించబడియున్నది. క్రైస్తవులు కూడా తమ్మును తాము తమ జీవితములలో నిందారహితులుగా, దోషములేనివారుగా ఉండాలనే ఆలోచనను వ్యక్తము చేయుటకు “పరిశుద్ధులు” అనే పదమును ఉపయోగించియున్నారు. ఇటువంటి సందర్భాలలో యుఎల్టి తర్జుమాలో “పరిశుద్ధత,” “పరిశుద్ధుడైన దేవుడు,” “పరిశుద్ధులు,” లేక “పరిశుద్ధ ప్రజలు” అనే పదాలను ఉపయోగించియున్నది. (చూడండి: 1:1,4)

  • కొన్నిమార్లు వాక్యభాగములో అర్థము సాధారణముగా క్రైస్తవులను సూచించుచును, ఇక్కడ వారు ఎటువంటి పాత్రను పోషించనవసరము లేదు. ఇటువంటి సందర్భాలలో, యుఎల్టి “విశ్వాసి” లేక “విశ్వాసులు” అనే పదమును ఉపయోగిస్తారు. *కొన్నిమార్లు వాక్యభాగములో అర్థము దేవునికే ప్రతిష్టించిన వస్తువునుగాని లేక ఒకరినిగూర్చిగాని తెలియజేయును. ఇటువంటి సందర్భాలలో, యుఎల్టి “ప్రత్యేకించుట,” “ప్రతిష్టించుట,” లేక “ప్రత్యేకించి కేటాయించుట” అనే పదాలను ఉపయోగించును. (చూడండి: 3:5)

తర్జుమాదారులు ఈ ఆలోచనలన్నియు తమ స్వంత అనువాదములలో ఎలా చెప్పాలనేదానినిగూర్చి తర్జుమాదారులు ఆలోచించే విధముగానే యుఎస్టి ఎల్లప్పుడూ సహాయకరముగా ఉంటుంది.

పౌలు ఉపయోగించిన “క్రీస్తునందు,” “ప్రభువునందు,” ఇంకా మొదలగు మాటలకు అర్థము ఏమిటి?

ఇటువంటి మాటలన్నియు 1:1,3,4,6,7,9,10,11,12,13,15,20; 2:6,7,10,13,15,16, 18,21, 22; 3:5,6,9,11,12,21; 4:1,17,21,32; 5:8,18,19; 6:1,10,18,21 వచనములలో కనిపిస్తాయి. క్రీస్తుతోనూ మరియు విశ్వాసులతోనూ ఏకమైయున్నారనే ఆలోచనను వ్యక్తము చేయుటయే పౌలు ఉద్దేశమునైయున్నది.

ఈ విధమైన మాటను గూర్చిన మరింత సమాచారమునుగూర్చి రోమా పత్రిక యొక్క పరిచయమును దయచేసి చూడండి.

ఈ ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలోని వాక్యభాగములలో ముఖ్యమైన కీలక విషయాలు?

  • “ఎఫెసులో” (1:1). కొన్ని ఆదిమ మూల ప్రతులలో ఈ మాటను చేర్చలేదు, కాని ఇది బహుశః మూల పత్రికలో ఉండవచ్చు. యుఎల్టి, యుఎస్టి మరియు అనేక ఆధునిక తర్జుమాలలో ఈ మాటను చేర్చియున్నారు.
  • “ఎందుకంటే మనము ఆయన దేహములో సభ్యులమైయున్నాము” (5:30). ఎక్కువ శాతపు ఆధునిక తర్జుమాలతోపాటు, యుఎల్టి మరియు యుఎస్టి తర్జుమాలలో ఈ విధముగా ఉంటుంది, “ఎందుకంటే మనము ఆయన దేహములో సభ్యులమైయున్నాము మరియు ఆయన ఎముకలమైయున్నాము.” తర్జుమాదారులు తమ ప్రాంతములలో రెండవ అనువాదమును కలిగియున్నట్లయితే, వారు దానినే ఎన్నుకోవచ్చును. ఒకవేళ తర్జుమాదారులు రెండవ తర్జుమానే ఎన్నుకున్నట్లయితే ఆ మాటలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికయొక్క మూల ప్రతిలో ఉండకపోవచ్చని చెప్పుటకు వాటిని చదరపు ఆకార బ్రాకెట్లలో పెట్టాలి ([]).

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)