te_tn_old/eph/05/intro.md

4.0 KiB

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 05 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలలో పద్యభాగ పంక్తులను సులభముగా చదువుటకు వాక్యములోకాకుండా వాక్యభాగానికి కుడి ప్రక్కన పెట్టుదురు. 14వ వచనములోనున్న పాత నిబంధన వాక్యములను యుఎల్టి అలాగే చేసి పెట్టింది.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

క్రీస్తు రాజ్యము యొక్క స్వాస్థ్యము

దీనిని అర్థము చేసుకోవడము క్లిష్టతరం. వీటినన్నిటిని చేయువారందరూ నిత్యజీవమును స్వతంత్రించుకొనరని కొంతమంది పండితులు నమ్ముదురు. అయితే ఈ వచనములో పట్టిక చేయబడిన పాపములన్నిటిని దేవుడు క్షమించును. అనైతికత, అపవిత్రత, లేక లోభము కలిగిన ప్రజలు ఒకవేళ యేసును విశ్వసించి, వాటన్నిటి విషయమై పశ్చాత్తాపపడినట్లయితే నిత్యజీవము పొందుకొనుటకు అవకాశము కలదు. ఎక్కువ మనము, “లైంగిక అనైతికత కలిగిన వ్యక్తి లేక అసభ్యకరముగా ప్రవర్తించే వ్యక్తి, లేక లోభియైనవాడు (ఇది విగ్రహారాధన చేయుటతో సమానము) రాజుగా క్రీస్తు పాలించే దేవుని ప్రజలలో ఉండబోరు” అని చదువుతుంటాము. (యుఎస్టి) (చూడండి: [[rc:///tw/dict/bible/kt/forgive]], [[rc:///tw/dict/bible/kt/eternity]] మరియు [[rc:///tw/dict/bible/kt/life]] మరియు [[rc:///tw/dict/bible/kt/inherit]])

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట సందర్భాలు

భార్యలారా మీ భర్తలకు లోబడియుండండి

దీనిని చారిత్రాత్మకముగా మరియు సాంస్కృతికమైన సందర్భములో అర్థము చేసికొనుట ఎలాగు అని చర్చించుటలో పండితులు వేరైపోయారు. స్త్రీ పురుషులు అన్ని విషయాలలో సమానమేనని కొంతమంది పండితులు నమ్ముదురు. వివాహములోను మరియు సంఘములోను స్త్రీ పురుషులు విభిన్నమైన పాత్రలు పోషించుటకు దేవుడు వారిని సృష్టించియున్నాడని మరికొంతమంది పండితులు నమ్ముదురు. వారు ఈ విషయాన్ని అర్థము చేసుకున్నదానికి మరియు వారు ఈ వాక్యభాగమును ఎలా తర్జుమా చేశారన్నదానికి విభేదము రాకుండా తర్జుమాదారులు చాలా జాగ్రత్త పడాలి.