te_tn_old/eph/02/intro.md

5.8 KiB

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 02 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

ఈ అధ్యాయము యేసును నమ్మక మునుపు క్రైస్తవుని జీవితము ఏమిటన్న దానిపై దృష్టి సారిస్తుంది. “క్రీస్తునందు” ఒక క్రైస్తవుని నూతనమైన గుర్తింపు పొందకమునుపు ఒక వ్యక్తి పాత జీవితము ఎలా ఉంటుందన్నదానిని వ్యక్తము చేయుటకు పౌలు ఈ సమాచారమును ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/faith)

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

ఒకే శరీరము

పౌలు ఈ అధ్యాయములో సంఘమును గూర్చి బోధించుచున్నాడు. సంఘములో రెండు విభిన్నమైన వర్గాలకు చెందిన ప్రజలు (యూదులు మరియు అన్యులు) ఉన్నారు. ఇప్పుడు వారు ఒకే గుంపుకు సంబంధించినవారు లేక ఒక “శరీరముకు” సంబంధించినవారు. సంఘమును క్రీస్తు శరీరము అని కూడా పిలుస్తారు. యూదులు మరియు అన్యులు క్రీస్తులో ఐక్యపరచబడియున్నారు.

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారములు

“అపరాధములలో మరియు పాపములలో చనిపోవుట”

క్రైస్తవులు కానివారు వారి పాపములో “చనిపోయియున్నారు” అని పౌలు బోధించుచున్నాడు. పాపము వారిని బంధించును లేక వారిని బానిసలుగాచేయును. ఇది వారిని ఆత్మీయముగా “చనిపోవుటకు” గురి చేయును. క్రైస్తవులు క్రీస్తునందు సజీవులుగా ఉండునట్లు దేవుడు చేస్తాడని పౌలు వ్రాయుచున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/other/death]], [[rc:///tw/dict/bible/kt/sin]] మరియు [[rc:///tw/dict/bible/kt/faith]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

లోకసంబంధమైన జీవనమును గూర్చిన వివరణలు

క్రైస్తవేతరులు ఎలా నడుచుకొందురని వివరించుటకు పౌలు అనేక విధానములను ఉపయోగించియున్నాడు. వారు “ఈ లోక పోకడలనుబట్టి జీవించారు” మరియు వారు “వాయు మండల అధికారి ప్రకారముగా జీవించుచున్నారు,” “మన పాప స్వభావపు చెడు ఆశలను నెరవేర్చుచున్నారు,” మరియు “శరీర క్రియలను మరియు మనస్సుకు సంబంధించిన ఆశలను నెరవేర్చుకొనుచున్నారు.”

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట విషయాలు

“ఇది దేవుని వరము”

”ఇది” అనే పదము ఇక్కడ రక్షించబడియుండుటను సూచిస్తుందని కొంతమంది పండితులు నమ్ముతారు. ఇది అనేది దేవుడు వరముగా ఇచ్చిన విశ్వాసమని కొంతమంది పండితులు నమ్ముదురు. గ్రీకు కాలములు ఒప్పుకొంటున్నట్లుగా, “ఇది” అనేది ఇక్కడ ఎక్కువ మట్టుకు విశ్వాసము ద్వారా దేవుని కృపచేత అందరు రక్షించబడియున్నారనే విషయమును సూచించుచున్నది.

శరీరము

ఇది క్లిష్టమైన విషయము. “శరీరము” అనేది ఒక వ్యక్తి యొక్క పాపసంబంధమైన స్వభావమును సూచించుటకు రూపకలంకారముగా ఉపయోగించబడియున్నది. “శరీరమందు అన్యులు” అనే మాట ఒకప్పుడు ఎఫెసీయులు దేవునిని గూర్చి అవగాహన లేకయే జీవించియున్నారు అని సూచించుచున్నది. ఈ వచనములో “శరీరము” అనే పదమును మనిషి యొక్క భౌతిక సంబంధమైన భాగమును సూచించుటకు కూడా ఉపయోగించబడియున్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/flesh)