te_tn_old/eph/02/06.md

3.3 KiB

God raised us up together with Christ

ఇక్కడ పైకి లేపుట అనేది ఒక నానుడి మాట. ఇది చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతుకునట్లు చేయుటను తెలియజేయుచున్నది. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును 1) ఎందుకంటే దేవుడు క్రీస్తును తిరిగి జీవించునట్లు చేసెను, దేవుడు ముందుగానే పౌలుకు మరియు ఎఫెసీలోని విశ్వాసులకు నూతన ఆత్మీయ జీవితమును ప్రసాదించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము క్రీస్తుకు సంబంధించియున్నందున దేవుడు మనకు క్రొత్త జీవితమును ఇచ్చియున్నాడు” లేక 2) ఎందుకంటే దేవుడు క్రీస్తును తిరిగి జీవించునట్లు చేసెనందున, ఎఫెసీలోని విశ్వాసులు కూడా వారు చనిపోయిన తరువాత క్రీస్తుతోపాటు జీవిస్తారనే విషయమును తెలుసుకుంటారు. విశ్వాసులు తిరిగి జీవించుటను గూర్చి అది ఇప్పటికే జరిగిందని, వారు ఇప్పుడు తిరిగి జీవిస్తున్నారని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు క్రీస్తును బ్రతికించిన ప్రకారమే దేవుడు మనకు కూడా జీవమును ఇస్తాడనే నిశ్చయతను మనము కలిగియుండవచ్చును. (చూడండి: [[rc:///ta/man/translate/figs-pastforfuture]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

in the heavenly places

అద్భుతమైన ప్రపంచములో. “పరలోకము” అనే పదము ఇక్కడ దేవుడు నివసించే స్థలమును సూచించుచున్నది. [ఎఫెసీ.1:3] (../01/03.ఎం.డి.) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.

in Christ Jesus

క్రీస్తు యేసులో మరియు ఇలాంటి మాటలన్నియు రూపకఅలంకారములే, ఇవి క్రొత్త నిబంధన పత్రికలలో ఎక్కువసార్లు కనిపిస్తాయి. ఈ మాటలు క్రీస్తుకును మరియు ఆయనను విశ్వసించిన వారికిని మధ్యన ఉండే బలమైన సంబంధమును తెలియజేయును.