te_tn_old/eph/01/intro.md

2.5 KiB

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 01 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

”నేను ప్రార్థిస్తాను”

పౌలు ఈ అధ్యాయములో ఒక భాగమును దేవునికి స్తుతి ప్రార్థనగా చేసియున్నాడు. అయితే, పౌలు కేవలము దేవునితో మాట్లాడుటలేదు. ఆయన ఎఫెసిలోని సంఘమునకు బోధ చేయుచున్నాడు. అతను ఎఫెసీయులకొరకు ఎలా ప్రార్థన చేయుచున్నాడన్న విషయము వారికి తెలియజేయుచున్నాడు.

ఈ అధ్యాయములో విశేషమైన అంశాలు

పూర్వమే నిర్ణయించబడియుండుట

“పూర్వమే నిర్ణయించబడియుండుట” అని పిలువబడే ఈ విషయమును ఈ అధ్యాయము బోధించునని అనేకమంది పండితులు నమ్ముదురు. “పూర్వమే నిర్ణయించబడుట” అనేది కేవలము బైబిలుపరమైన అంశాలకు మాత్రమె సంబంధించియుంటుంది. లోకము పునాదులు వేయబడకమునుపే నిత్య రక్షణ పొందుటకు దేవుడు ముందుగానే కొంతమందిని ఏర్పరచబడియున్నాడని సూచించుటకు ఈ వాక్యభాగమును కొందరు పండితులు చెప్పుదురు. బైబిలు ఈ విషయము ఏమి బోధిస్తుందనే దాని మీద క్రైస్తవులకు అనేక దృష్టికోణములు కలవు. అందుచేత, ఈ అధ్యాయమును తర్జుమా చేయుచున్నప్పుడు తర్జుమాదారులు మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకొనవలసిన అవసరము ఉన్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/predestine)