te_tn_old/col/01/intro.md

3.3 KiB

కొలస్సయులకు 01 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

ఒక సాధారణ లేఖవలె, పౌలు తన పత్రికను 1-2 వచనాలలో కొలొస్సీలోని క్రైస్తవులకు తనను మరియు తిమోతిని పరిచయము చేయుటద్వారా వ్రాయుటకు ఆరంభించియున్నాడు.

పౌలు ఈ అధ్యాయమును రెండు విషయాలుగా విభజించి వ్రాయుచున్నాడు: క్రీస్తు ఎవరు, మరియు క్రీస్తు క్రైస్తవులకొరకు ఏమి చేసియున్నాడు.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

రహస్య సత్యము

పౌలు ఈ అధ్యాయములో “రహస్య సత్యమును” సూచించుచున్నాడు. దేవుని ప్రణాళికలలో సంఘము యొక్క పాత్ర ఒకప్పుడు తెలియదు. అయితే దేవుడు దానిని ఇప్పుడు బయలుపరచియున్నాడు. దేవుని ప్రణాళికలలో యూదులతోపాటు అన్యులు సమాన స్థాయిని కలిగియున్నారని ఈ భాగము తెలియజేయుచున్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/reveal)

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన రూపకఅలంకారములు

క్రైస్తవ జీవితముకొరకు చిత్రాలు

క్రైస్తవ జీవితమును వివరించుటకు పౌలు అనేక విభిన్నమైన చిత్రాలను ఉపయోగించుచున్నాడు. ఈ అధ్యాయములో ఆయన “నడచుట” మరియు “ఫలము ఫలించుట” అనే చిత్రాలను ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/other/fruit)

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట భాగాలు

అసంబంధము

అసాధ్యమైనవాటిని వివరించుటకు కనిపించే నిజమైన వ్యాఖ్యయే అసంబంధము అని పిలుతురు. 24వ వచనము ఒక అసంబంధము: “ఇప్పుడు నేను మీ కొరకు నా శ్రమలలో ఆనందించుచున్నాను.” ప్రజలు శ్రమపొందునప్పుడు సహజముగా ఆనందించరు. అయితే 25-29 వచనాలాలో శ్రమలు ఎందుకు మంచివిగా ఉంటాయని వివరించుచున్నాడు. ([కొలస్సయులకు.1:24] (../../కొల/01/24.ఎం.డి.))