te_tn_old/act/front/intro.md

11 KiB

అపొస్తలుల కార్యముల గ్రంథ పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

అపొస్తలుల కార్యముల గ్రంథ నిర్మాణము

  1. సంఘ ప్రారంభము మరియు దాని యొక్క పని (1:1-2:41)
  2. యెరూషలేములో ఆదిమ సంఘము (2:42-6:7)
  3. పెరుగుతున్న విరోధతత్వం మరియు స్తెఫెను హతసాక్షి కావడం (6:8-7:60)
  4. సంఘమునకు శ్రమ మరియు ఫిలిప్పు పరిచర్య (8:1-40)
  5. పౌలు అపొస్తలుడుగా మారుట (9:1-3)
  6. పేతురు సేవ మరియు మొట్టమొదటిగా అన్యులు మార్చబడుట (9:32-12:24)
  7. పౌలు అన్యులకు అపొస్తలుడు, యూదుల ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగినవాడు మరియు యెరూషలేములోని సంఘ నాయకుల చట్ట సభలో ఒకడు (12:25-16:5)
  8. చిన్న ఆసియా మరియు మధ్యధరా ప్రాంతములో సంఘము వ్యాపించుట (16:6-19:20)
  9. పౌలు యెరూషలేమునకు ప్రయాణము చేయుట మరియు రోమాలో ఖైదీగా బంధించబడుట (19:21-28:31)

అపొస్తలుల కార్యముల గ్రంథము దేనిని గూర్చి వ్రాయబడింది?

అపొస్తలుల కార్యముల గ్రంథము ఎక్కువ మంది విశ్వాసులుగా మార్చబడిన ఆదిమ సంఘపు చరిత్రను గూర్చి మనకు తెలియజేయుచున్నది. పరిశుద్ధాత్ముని శక్తి ఆదిమ క్రైస్తవులకు సహాయము చేయుటను గూర్చి చూపించుచున్నది. ఈ గ్రంథములోని సన్నివేశాలన్ని కూడా యేసు పరలోకానికి ఆరోహణమైనప్పటినుండి దరిదాపు ముప్పై సంవత్సరాలవరకు జరిగిన సంఘటనలతో ముగుస్తుంది.

ఈ గ్రంథమునకున్న పేరును ఏ విధముగా తర్జుమా చేయాలి?

తర్జుమాదారులు ఈ పుస్తకమును “అపొస్తలుల కార్యములు” అనే పేరుతోనే పిలువవచ్చును. లేక తర్జుమాదారులు ఈ పుస్తకమును ఇంకా స్పష్టముగా కూడా పిలువవచ్చును. ఉదాహరణకు, “అపొస్తలుల ద్వారా జరిగిన పరిశుద్ధాత్ముని క్రియలు” అని కూడా పిలువవచ్చును.

అపొస్తలుల కార్యముల గ్రంథమును ఎవరు వ్రాశారు?

ఈ పుస్తకము యొక్క గ్రంథకర్త ఎవరో తెలియజేయుటలేదు. ఏదేమైనా, లూకా సువార్త గ్రంథము ఎవరికైతే వ్రాసియున్నారో అదే వ్యక్తికి అనగా తియొఫిలాకు ఈ పుస్తకము వ్రాస్తున్నట్లుగా మనకు కనబడును. అంతేగాకుండా, ఈ పుస్తకపు అనేక వాక్యభాగాలలో గ్రంథకర్త “మేము” అనే పదమును ఉపయోగించియున్నాడు. ఈ పదాన్ని బట్టి గ్రంథకర్త పౌలుతో ప్రయాణము చేసియున్నాడని తెలియవచ్చుచున్నది. పౌలుగారితో ప్రయాణము చేసిన ఈ వ్యక్తి లూకానేనని అనేకమంది పండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అందుచేత, ఆదిమ క్రైస్తవ కాలములో అనేకమంది క్రైస్తవులు లూకా సువార్తకు మరియు అపొస్తలుల కార్యముల గ్రంథమునకు లూకా గ్రంథకర్తయని ఆలోచించారు.

లూకా వైద్యుడైయుండెను. ఆయన వ్రాసిన విధానమే ఆయన బాగా చదువుకున్న చదువరియని తెలియజేస్తోంది. ఆయన బహుశః అన్యుడైయుండవచ్చును. ఈ అపొస్తలుల కార్యముల గ్రంథములో చెప్పబడిన అనేకమైన సంఘటనలను ఆయన తన కళ్ళతో చూశాడు.

భాగము 2: ప్రాముఖ్యమైన భక్తి మరియు సాంస్కృతికపరమైన ఉద్దేశాలు

సంఘము అనగానేమి?

క్రీస్తునందు విశ్వసించిన ప్రజల సమూహమే సంఘము. సంఘమునందు యూదులు మరియు అన్యులైన విశ్వాసులు ఉంటారు. ఈ పుస్తకమందున్న సంఘటనలన్నియు దేవుడు సంఘానికి సహాయము చేసినట్లుగా తెలియజేయుచున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులందరు నీతియుతమైన జీవితమును జీవించాలని ఆయన వారిని బలపరిచియున్నాడు.

భాగము 3: ప్రాముఖ్యమైన తర్జుమా విషయాలు

అపొస్తలుల కార్యముల గ్రంథములో ముఖ్యమైన విషయాలు ఏమిటి?

అపొస్తలుల కార్యముల గ్రంథములోని ప్రాముఖ్యమైన విషయాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి:

ఈ క్రింద ఇవ్వబడిన వచనములన్నియు బైబిలుయొక్క పాత అనువాదములలో కనబడును, కాని బైబిలు గ్రంథముయొక్క ఉత్తమ పురాతన ప్రతులలో అవి లేవు. కొన్ని ఆధునిక తర్జుమాలలో వచనాలను బ్రాకెట్లలో పెట్టుదురు ([]). యుఎల్.టి మరియు యుఎస్.టి వాటిని పేజికి క్రింది భాగములో పెట్టుదురు.

  • ‘నీవు హృదయపూర్వకముగా నమ్మినట్లయితే, నీవు బాప్తిస్మము పొందవచ్చు’ అని ఫిలిప్పు చెప్పాడు. అప్పుడు ఆ నపుంసకుడు, ‘యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను’ అని జవాబిచ్చాడు” (అపొ.కార్య.8:37).
  • “సీల అక్కడే ఉండడం చాలా మంచిది.” (అపొ.కార్య.15:34)
  • “మాకున్న కట్టుబాట్లనుబట్టి మేము అతనికి తీర్పు తీర్చాలనుకున్నాము. కాని, సైనికాధికారి లుసియస్ వచ్చి, బలవంతముగా మా చేతులలోనుండి అతనిని తీసుకొని వెళ్లి, మీ వద్దకు పంపించాడు.” (అపొ.కార్య.24:6బి-8ఎ)
  • “అతను ఈ విషయాలన్ని చెప్పిన తరువాత, యూదులు వెళ్లిపోయారు, వారిలో వారికి కలహాలు ఎక్కువయ్యాయి.” (అపొ.కార్య.28:29)

ఈ క్రిందనున్న వచనములలో, మూల ప్రతులలోని వాక్యములు చెప్పినదానికంటే అనిశ్చితముగా ఉంటుంది. తర్జుమా చేయుటకు ఏది చదివితే బాగుంటుందో దానినే తర్జుమా దారులు ఎన్నుకోవాలి. యుఎల్.టి చదవడానికి ప్రథమముగా వ్రాయబడినవాటిని కలిగియుంటుంది. కానీ అందులోనే పేజీల క్రింద రెండవమారు వ్రాయబడినవి ఉన్నవి.

  • “వారు యెరూషలేమునుండి తిరిగివచ్చిరి” (అపొ.కార్య.12:25). మరికొన్ని తర్జుమాలలో, “వారు యెరూషలేముకు వెళ్ళిరి (లేక అక్కడికి వెళ్ళిరి).”

“ఆయన వారితో నివసించాడు” (అపొ.కార్య.13:18). మరికొన్ని తర్జుమాలలో, “ఆయన వారిని లక్ష్యపెట్టాడు” అని వ్రాయబడియున్నది.

  • “అనాది కాలమునుండే తెలియబడిన ఈ కార్యములన్నియు చేసిన ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” (అపొ.కార్య.15:17-18). కొన్ని పాత తర్జుమాలలో, “పురాతన కాలమునుండి ఆయన చేసిన అన్ని కార్యములన్నిటికి కర్తయైన ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అని వ్రాయబడియుండును.

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)