te_tn_old/act/27/intro.md

2.0 KiB

అపొ. కార్య. 27 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

ఓడ ప్రయాణం

సముద్రము దగ్గర నివసించేవారు గాలితో త్రోయబడే ఓడలో ప్రయాణించేవారు. సంవత్సరములో కొన్ని మాసములలో గాలి విరుద్ధ దిశలో వీచేది లేక ఓడ ప్రయాణము అసంభవం అనునంతగా కష్టముగానుండేది.

నమ్మకము

దేవుడు అతనిని క్షేమముగా నేలమీదికి నడిపిస్తాడని పౌలు దేవునియందు నమ్మికయుంచియుండెను. దేవుడు సైనికులను మరియు ఓడ నడుపువారిని కూడా సజీవంగా ఉంచుతాడని ఆయనలో నమ్మకముంచాలని అతడు వారితో చెప్పెను. (చూడండి: rc://*/tw/dict/bible/kt/trust)

పౌలు రొట్టె విరుచుట

యేసు తన శిష్యులతో చేసిన ప్రభు రాత్రి భోజనమును వివరించు విధముగానే ఇక్కడ పౌలు రొట్టె తీసుకొని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించి, దానిని విరచి మరియు భుజించెను అని అదే విధమైన పదములను లూకా ఉపయోగించియున్నాడు. అయితే, పౌలు ఇక్కడ మతాచారమును నడిపిస్తున్నాడని మీ చదువరులు అనుకోను విధముగా మీ తర్జుమ ఉండకూడదు.