te_tn_old/act/20/intro.md

2.1 KiB

అపొస్తలుల కార్యములు 20 సాధారణ విషయాలు లేక అంశాలు

నిర్మాణము మరియు క్రమము

పౌలు యెరూషలేముకు వెళ్ళక మునుపు ఆసియా మరియు మాసిదోనియా ప్రాంతాలలోని విశ్వాసులను చివరిగా దర్శించు విషయాలను లూకా ఈ అధ్యాయములో వివరించుచున్నాడు.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు లేక ఆలోచనలు

పందెం

యేసుకొరకు జీవించుటయనునది పందెములో పరుగెత్తడములాంటిదని పౌలు చెప్పుచున్నాడు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, విడిచిపెట్టాలనుకున్నప్పుడు అతను గొప్ప కృషి చేయవలసియుంటుందని చెప్పకనే ఆ మాట ద్వారా చెప్పుచున్నాడు. (చూడండి:[[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///tw/dict/bible/kt/discipline]])

“ఆత్మ ద్వారా బలవంతము చేయబడెను”

పౌలు యెరూషలేముకు వెళ్లాలని ఇష్టము లేకపోయినా పరిశుద్ధాత్ముడు అక్కడికే వెళ్ళాలని చెప్పుచున్నట్లు పౌలు భావించాడు. పౌలు యెరూషలేముకు వెళ్ళిన తరువాత, ప్రజలు తనను హింసకు గురి చేస్తారని కూడా అదే పరిశుద్ధాత్ముడు తెలియజేసెను.