te_tn_old/act/19/intro.md

1.7 KiB

అపొస్తలుల కార్యాములు 19 సాధారణ విషయాలు లేక అంశాలు

ఈ అధ్యాయములో విశేషమైన అంశాలు లేక ఉద్దేశాలు

బాప్తిస్మం

ప్రజల పాపములు క్షమించబడినవని చూపించుటకు యోహాను ప్రజలకు బాప్తిస్మము ఇచ్చెను. యేసు అనుచరులు యేసును వెంబడించాలని ఇష్టపడిన ప్రజలకు బాప్తిస్మమిచ్చిరి.

డయానా దేవాలయము

ఎఫెసు పట్టణములో డయానా చాలా ప్రాముఖ్యమైన పట్టణమైయుండెను. ఈ దేవాలయమును సందర్శించుటకు అనేకులు ఎఫెసుకు వచ్చేవారు, మరియు వారు అక్కడ ఉన్నప్పుడే డయానా దేవత ప్రతిమలను కొనుగోలు చేసేవారు. డయానా విగ్రహాలను అమ్ముకునే వ్యాపారస్తులు భయపడేవారు, ఎందుకంటే ప్రజలు ఒకవేళ డయానా నిజమైన దేవతని వారు నమ్మకపోతే, వారు కొనుక్కునే విగ్రహాలకొరకు డబ్బులు ఇవ్వరనే భయాందోళనను కలిగియుండిరి.