te_tn_old/act/17/intro.md

2.2 KiB

అపొస్తలుల కార్యములు 17 సాధారణ విషయాలు

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు

మెస్సయ్యాను గూర్చిన అపార్థములు

క్రీస్తు లేక మెస్సయ్యా శక్తివంతమైన రాజుగా ఉంటాడని యూదులు ఎదురుచూచియుండిరి, ఎందుకంటే పాత నిబంధన అనేకమార్లు అలాగే చెప్పింది. అయితే మెస్సయ్యా శ్రమలను అనుభవిస్తాడని కూడా అనేకమార్లు చెప్పడం జరిగింది, మరియు దానినే పౌలు యూదులైన వారికి చెప్పుచుండెను. (చూడండి:rc://*/tw/dict/bible/kt/christ)

ఏథెన్సుయొక్క భక్తి

ఏథెన్సు వారు“భక్తిపరులైయుండిరని” పౌలు భక్తుడు చెప్పెను, కాని వారు నిజమైన దేవునిని ఆరాధించేవారు కారు. వారు అనేక తప్పుడు దేవుళ్ళను పూజిస్తూ ఉండిరి. గతములో వారు ఇతర ప్రజల మీద జయము పొందియుండిరి మరియు వారు జయించిన ప్రజల దేవుళ్ళను ఆరాధించుటకు మొదలుపెట్టిరి. (చూడండి: rc://*/tw/dict/bible/kt/falsegod)

పాత నిబంధనగూర్చి ఏమీ తెలియని ఈ ప్రజలకు మొట్ట మొదటిసారిగా క్రీస్తు సందేశమును పౌలు ఎలా చెప్పాడన్న విషయాన్ని లూకా భక్తుడు ఈ అధ్యాయములో వివరించుచున్నాడు.