te_tn_old/act/16/intro.md

2.7 KiB

అపొస్తలుల కార్యములు 16 సాధారణ విషయాలు లేక అంశాలు

ఈ అధ్యాయములో విశేషమైన ఉద్దేశాలు

తిమోతి సున్నతి

పౌలు తిమోతికి సున్నతి చేయించెను ఎందుకంటే వారు యేసును గూర్చిన సందేశమును యూదులకు మరియు అన్యులకు చెప్పియుండిరి. యెరూషలేములోని సంఘ నాయకులందరూ క్రైస్తవులు సున్నతి చేసుకోవలసిన అవసరము లేదని నిర్ణయము చేసినప్పటికి అతను మోషే ధర్మశాస్త్రమును గౌరవించియున్నాడనే విషయాన్ని యూదులు తెలుసుకోవాలని ఆశ కలిగియుండెను..

సోదె చెప్పే ఆత్మను కలిగియున్న స్త్రీ

అనేకమంది ప్రజలు తమ భవిష్యత్తును తెలుసుకోవాలనే కోరికను కలిగియుండిరి, కాని భవిష్యత్తును గూర్చి తెలుసుకోవడానికి చనిపోయిన ప్రజల ఆత్మలతో మాట్లాడుట పాపమని మోషే ధర్మశాస్త్రము చెప్పియుండెను. ఈ స్త్రీ భవిష్యత్తును బాగుగా చెప్పే సామర్థ్యము కలిగియున్నట్లుగా కనిపించుచున్నది. ఆమె ఒక బానిస, మరియు తన యజమానులు తన పని ద్వారా ఎక్కువ డబ్భును సంపాదించియుండిరి. అటువంటి పాపమును చేయకుండా పౌలు ఆపాలనుకున్నాడు, అందుచేత అతను ఆమెలోని ఆత్మను వదిలిపెట్టి వెళ్ళిపొమ్మని చెప్పెను. ఆత్మ ఆమెను విడిచివెళ్లిపోయిన తరువాత ఆమె యేసును అనుసరించిందో లేదోనన్న విషయాన్ని మరియు ఆమెను గూర్చిన సమాచారమును లూకా చెప్పలేదు