te_tn_old/act/15/intro.md

3.8 KiB

అపొస్తలుల కార్యములు 15 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమము

కొన్ని తర్జుమాలలో పాతనిబంధననుండి తీసిన వ్యాఖ్యలు వాక్యభాగములో పెట్టుటకంటే పేజికి కుడివైపున పెట్టుదురు. 15:16-17 వచన భాగము పాత నిబంధననుండి క్రోడీకరించబడినవి యుఎల్.టి పద్యభాగము రూపములో అమర్చింది.

ఈ అధ్యాయములో లూకా వివరించే సమావేశమును సాధారణముగా “యెరూషలేము సమావేశము” అని పిలిచెదరు. మోషే ధర్మశాస్త్రమందంతటికి విశ్వాసులు విధేయత చూపవలసిన అవసరత ఉందా లేదని నిర్ణయించుటకు అనేకమంది సంఘ నాయకులు కూడి వచ్చిన సమావేశమైయుండెను.

ఈ అధ్యాయములో సామాజికపరమైన ఆలోచనలు

సహోదరులు

తోటి యూదులు అని సంబోధించుటకు బదులుగా తోటి క్రైస్తవులను సూచించుటకు ఈ అధ్యాయములో లూకా “సహోదరులారా” అనే పదమును ఉపయోగించుచున్నాడు.

మోషే ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట

కొంతమంది విశ్వాసులు అన్యులైనవారు సున్నతి చేసుకోవాలని కోరిరి, ఎందుకంటే ప్రజలందరూ దేవునికి సంబంధించినవారుగా ఉండాలంటే తప్పకుండ సున్నతి చేయించుకోవాలని మరియు ఈ నిబంధన ఎప్పటికి ఉంటుందని దేవుడు అబ్రాహాము మరియు మోషేలకు చెప్పియుండెను. కాని దేవుడు సున్నతి పొందనివారికి పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించినదానిని పౌలు మరియు బర్నబాలు చూసియుండిరి. అందుచేత ఇరువైపుల వర్గాలవారు ఆ విషయమై ఏమి చేయాలన్నదానిని నిర్ణయించుకొనుటకు సంఘ నాయకులు ఉన్నటువంటి యెరూషలేముకు వెళ్ళిరి.

“లైంగిక అనైతికతనుండి, గొంతు నులిమి చంపేవాటినుండి, రక్తము, విగ్రహారాదనలకు అర్పించినవాటినుండి మానుకొనుట”

ఈ నియమాలపైన సంఘ నాయకులు సరియైన రీతిలో నిర్ణయించుకొనే అవకాశము కలదు, తద్వారా యూదులు అన్యులతో కలిసి జీవించుట మాత్రమేగాకుండా వారితో కలిసి భోజనము చేయుటకు తీర్మానించుకొనిరి.