te_tn_old/act/15/23.md

2.2 KiB

From the apostles and elders, your brothers, to the Gentile brothers in Antioch, Syria, and Cilicia: Greetings!

ఇది పత్రిక యొక్క ఉపోద్ఘాతమైయున్నది. పత్రిక కర్తను మరియు ఆ పత్రికను ఎవరికి వ్రాయబడిందోనని పరిచయము చేసే విధానము మీ భాషలో కూడా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ పత్రిక మీ సోదరులైన అపొస్తలులు మరియు పెద్దలనుండి వచ్చింది. అంతియొకయ, సిరియా మరియు కిలికియలోని అన్య విశ్వాసులైన మీకు మేము వ్రాయుచున్నాము. మీకు శుభములు” లేక “అంతియొకయ, సిరియా, మరియు కిలికియలోని మన అన్య విశ్వాసులందరికి మీ సోదరులైన అపోస్తలులు మరియు పెద్దలునుండి తెలియజేయు శుభములు”

your brothers ... the Gentile brothers

ఇక్కడ “సోదరులు” అనే పదము తోటి విశ్వాసులను సూచించుచున్నది. ఈ పదాలను ఉపయోగించుట ద్వారా యూదులైన విశ్వాసులు అన్యులైన విశ్వాసులను తమ తోటి విశ్వాసులుగా అంగీకరించియున్నారని అపొస్తలులు మరియు పెద్దలు అన్యులైన విశ్వాసులకు నమ్మకం కలిగించిరి.

Cilicia

ఇది సిప్రస్ ద్వీపముయొక్క ఉత్తర చిన్నాసియలోని సముద్ర తీరముననున్న ప్రాంతముయొక్క పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)