te_tn_old/act/09/intro.md

3.8 KiB

అపొస్తలుల కార్యములు 09 సాధారణ అంశాలు

ఈ అధ్యాయములో విశేషమైన అంశాలు లేక ఆలోచనలు

“మార్గము”

”మార్గమును వెంబడించువారు” అని మొదటిగా విశ్వాసులను పిలుచుట ఎప్పుడు ఆరంభమైనదని ఎవరికీ తెలియదు. బహుశః విశ్వాసులు తమ్మును తాము ఈ విధముగా పిలుచుకొనుచు ఉండవచ్చు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తన జీవితమును జీవిస్తూ ఉన్నాడను విషయాన్ని ఆ వ్యక్తి ఒక దారిలోగాని లేక “మార్గములో” నడుస్తూ ఉన్నట్లుగా చెప్పబడింది. ఇది నిజమైతే, విశ్వాసులు దేవునిని మెప్పించే మార్గములో జీవించుటద్వారా “ప్రభువు మార్గమును వెంబడించువారైయుందురు.”

“దమస్కులోని సమాజమందిరములకొరకు పత్రాలు”

క్రైస్తవులను చెరసాలలో ఉంచుటకొరకు పౌలును అనుమతించే చట్టపరమైన పత్రాలకొరకు బహుశః పౌలు అడిగియుండవచ్చును. దమస్కులోని సమాజమందిర నాయకులు ఆ పత్రాలకు విధేయత చూపించేవారేమో, ఎందుకంటే అది మహా యాజకునిచేత వ్రాయబడియుంటుంది. ఒకవేళ రోమీయులు ఆ పత్రమును చూచినట్లయితే, వారు కూడా క్రైస్తవులను హింసించుటకు సౌలుకు అనుమతి ఇచ్చేవారేమో, ఎందుకంటే వారి మతపరమైన నియమాలను ఉల్లంఘించు ప్రజలను వారికి ఇష్టము వచ్చినట్లుగా చేయుటకు వారు యూదులకు అనుమతినిచ్చారు.

ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన క్లిష్ట సందర్భాలు

సౌలు యేసును కలిసికొనినప్పుడు అతడు ఏమి చూశాడు

సౌలు వెలుగును చూశాడని స్పష్టముగా ఉన్నది మరియు అది వెలుగైనందున అతడు “నేల మీదకి పడిపోయాడు.” మనిషి ఆకారము చూడకుండానే ప్రభువు తనతో మాట్లాడుచున్నాడనే విషయము సౌలుకు తెలుసునని కొంతమంది అనుకొనుచున్నారు. ఈ సంఘటన జరిగిన కొంత కాలము తరువాత “నేను ప్రభువైన యేసును చూశానని” అతను చెప్పుకొనుచున్నారని కొంతమంది యోచించుదురు, ఎందుకంటే అతను చూసింది మనుష్య ఆకారమైయుండెను.