te_tn_old/act/07/intro.md

6.7 KiB

అపొస్తలుల కార్యములు 07 సాధారణ అంశాలు లేక విషయాలు

నిర్మాణము మరియు క్రమము

చదవడానికి సులభముగా ఉండునట్లు వాక్యభాగము ఉన్నట్లుగానే వ్రాయకుండ ప్రతి పంక్తిని పద్యభాగమువలె కొన్ని తర్జుమాలు అమర్చుతూ ఉంటారు. 7:42-43 మరియు 49-50 వచన భాగములలో పాతనిబంధననుండి తీసుకొనిన మాటలను యుఎల్.టి పద్యభాగమువలె వ్రాసియున్నది.

8:1 వచనము ఈ అధ్యాయముయొక్క కథన భాగముగా కనిపిస్తుంది.

“స్తెఫెను చెప్పెను”

ఇశ్రాయేలీయుల చరిత్రను చాలా క్లుప్తముగా స్తెఫెను చెప్పెను. ఇశ్రాయేలీయులను నడిపించుటకు దేవుడు ఎన్నుకొనిన తన ప్రజలను ఇశ్రాయేలీయులు తిరస్కరించిన సందర్భాలపై అతను ప్రత్యేకమైన దృష్టిని సారించాడు. అతను సంభాషణ చివరి భాగములో, దేవుడు వారి కొరకు నియమించుకొనిన నాయకులను తిరస్కరించిన దుష్ట ఇశ్రాయేలీయులవలె యూదా నాయకులు కూడా యేసును తిరస్కరించియున్నారని చెప్పెను.

“పరిశుద్ధాత్మ నింపుదల”

పరిశుద్ధాత్ముడు సంపూర్ణముగా స్తెఫెనును నియంత్రించెను తద్వారా స్తెఫెను ఏమి చెప్పాలని దేవుడు కోరుకున్నాడో వాటిని మాత్రమె అతను చెప్పాడు.

ముందస్తు సూచన

దేనిని గూర్చియైన రచయిత మాట్లాడుచున్నప్పుడు ఆ సమయములో అది ప్రాముఖ్యమైన విషయము కాకపోవచ్చుగాని, అది తరువాతైనా కథలో ప్రాముఖ్యమైన విషయముగా మారుతుంది. దీనినే ముందస్తు సూచన అని పిలిచెదరు. ఈ కథన భాగములో సౌలనబడిన పౌలు ప్రాముఖ్యమైన వ్యక్తి కాకపోయినప్పటికి లూకా ఇక్కడ ఆయనను పరిచయము చేస్తున్నాడు. ఇందుకే మిగిలిన అపొస్తలుల కార్యముల గ్రంథములో పౌలు చాల ప్రాముఖ్యమైన వ్యక్తియైయుండును.

ఈ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైన భాష అలంకారములు కలవు

అన్వయించుకొనదగిన సమాచారము

మోషే ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగినవారితో స్తెఫెను మాట్లాడియున్నాడు. అందుచేత ముందుగానే అన్ని తెలిసిన ప్రేక్షకులకు అతను మరలా ఆ విషయాలను వివరించనక్కరలేదు. అయితే మీరు ఈ విషయాలలో కొన్నిటిని తప్పకుండ వివరించాలి, తద్వారా స్తెఫెను ఏమి బోధించుచున్నాడో ఆ విషయాలన్నిటిని చదువరులు అర్థము చేసికొనగలరు. ఉదాహరణకు, యోసేపు సోదరులు ([అపొ.కార్య.7:9] (../../అపొ.కార్య./07/09.ఎం.డి)) వచనములో “తనను ఐగుప్తులోనికి అమ్మిన” విషయాలను మీరు స్పష్టముగా వివరించాల్సిన అవసరము ఉంది, యోసేపు ఐగుప్తులో బానిసగా ఉండుటకు వెళ్లియున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

అలంకారిక రూపము

యోసేపు “ఐగుప్తుయంతటిని” మరియు ఫరో కుటుంబమంతటిని పాలించునని స్తెఫెను మాట్లాడియున్నాడు. ఆయన ఈ మాటలు చెప్పుటకు అర్థము ఏమనగా ఫరో ఇంటిలో ప్రజల మీద, సమస్త ఆస్తియంతటి మీద మరియు ఐగుప్తు ప్రజలందరి మీద యోసేపు అధికారిగా ఉండి పరిపాలించియున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

ఈ అధ్యాయములో తర్జుమా సంబంధమైన క్లిష్ట భాగములు

నేపథ్య సమాచారము

స్తెఫెను మాట్లాడుచున్న యూదా నాయకులకు స్తెఫెను వేటిని గూర్చి మాట్లాడుచున్నాడో ఆ విషయాలన్నిటిని గూర్చి వారికి ముందుగానే బాగుగా తెలుసు. ఆదికాండములో మోషే వ్రాసిన సంగతులన్నీ వారికి తెలుసు. ఆదికాండము మీ భాషలోనికి చేయకపోయినట్లయితే, స్తెఫెను చెబుతున్న విషయాలు మీ చదువరులు అర్థముచేసికోవడం చాల కష్టముగా ఉండవచ్చును.