te_tn_old/act/05/intro.md

1.8 KiB

అపొస్తలుల కార్యములు 05 సాధారణ విషయాలు

ఈ అధ్యాయములో విశేషమైన భావాలు

“పరిశుద్ధాత్మకు అబద్ధము చెప్పుటకు సాతానుడు మీ హృదయములను నింపియున్నాడు”

([అపొ.కార్య.5:1-10] (../05/01.ఎం.డి) వచనభాగములో వారు అమ్మిన భూమిని గూర్చి అబద్దమాడుటకు అననియ సప్పిరాలు నిర్ణయించుకున్నప్పుడు వారు నిజమైన క్రైస్తవులని ఎవరికీ అంత ఖచ్చితంగా తెలియకయుండెను, ఎందుకంటే లూకా ఆ విషయమును చెప్పుటలేదు. ఏదేమైనా, వారు విశ్వాసులకు అబద్ధము చెప్పియున్నారని పేతురు తెలుసుకున్నాడు, మరియు వారు సాతాను మాట విని, ఆ సాతానుకు విధేయత చూపియున్నారని అతను తెలుసుకొనియున్నాడు.

వారు విశ్వాసులతో అబద్ధము చెప్పినప్పుడు, వారు పరిశుద్ధాత్మతో కూడా అబద్ధము చెప్పినవారైరి. ఎందుకంటే విశ్వాసులలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు.